కోరుట్ల, జూలై 29 : జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో మంగళవారం నాగుల పంచమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక మహాదేవ స్వామి దేవాలయం, పెద్దమ్మ గుడి, సాయిబాబా దేవాలయం ప్రాంగణంలో పాముల పుట్టలో పాలు పోసిన భక్తులు నాగులమ్మ తల్లికి పంచదార, పళ్ళు నైవేద్యంగా సమర్పించి ముక్కులు చెల్లించుకున్నారు.
పట్టణంలోని మహాదేవ స్వామి ఆలయంలో శివలింగానికి కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా నాగులమ్మ తల్లికి ప్రత్యేక పూజలు చేసి పుట్టలో పాలు పోశారు. నియోజకవర్గ ప్రజలను చల్లంగా చూడు తల్లి అని నాగులమ్మను వేడుకున్నారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు పిట్టల నరేష్, బీఆర్ఎస్ నాయకులు గెల్లే గంగాధర్, బట్టు సునీల్, ఫహీం, పుట్ట సురేందర్ ములుమూరి మురళి, భక్తులు, తదితరులు పాల్గొన్నారు.