నమస్తే నెట్వర్క్, జూన్ 28: రైతుబంధు సంబురాలు అంబరాన్నంటుతున్నాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా హోరెత్తుతున్నాయి. మంగళవారం ఉదయం నుంచి ఖాతాల్లో డబ్బులు జమ చేస్తుండగా, కర్షకులు మురిసిపోతున్నారు. ఊరూరా సీఎం కేసీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకం చేస్తున్నారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం మధురానగర్ చౌరస్తాలో టీఆర్ఎస్ నాయకులు, ప్రజలతో కలిసి సీఎం కేసీఆర్ చిత్రపటానికి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పాలాభిషేకం చేశారు. బోయినపల్లి మండల కేంద్రంలో ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్, జడ్పీటీసీ కత్తెరపాక ఉమా కొండయ్య, మండల రైతు బంధు సమితి కన్వీనర్ కొనుకటి లచ్చిరెడ్డి సంబురాలు జరుపుకున్నారు. సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. గంభీరావుపేట మండల కేంద్రంలోని రైతు వేదిక వద్ద ఆర్బీఎస్ మండల కన్వీనర్ రాజేందర్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పాపాగారి వెంకటస్వామిగౌడ్, ఏఎంసీ చైర్పర్సన్ సుతారి బాలవ్వ, చొప్పదండి మండల కేంద్రంలోని తెలంగాణ చౌరస్తావద్ద టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు వెల్మ శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో ఎంపీపీ చిలుక రవీందర్, మున్సిపల్ చైర్పర్సన్ గుర్రం నీరజ రైతులు, టీఆర్ఎస్ నాయకులు కలిసి సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.