జగిత్యాల : జిల్లా కేంద్రంలోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ బాలికల హాస్టల్లో ఫుడ్ పాయిజన్ జరిగింది. గత రాత్రి పెరుగుతో అన్నం తిన్న తర్వాత కడుపు నొప్పి, వాంతులతో 58 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వారిని వెంటనే జగిత్యాల దవాఖానకు తరలించారు. 19 మంది విద్యార్థులు అడ్మిట్ చేసుకోగా మిగతా 39 మంది చికిత్స అనంతరం హాస్టల్కు తరలించారు.