జగిత్యాల : మైనార్టీ తీరక ముందే బాలికకు వివాహం చేస్తుండటంతో అధికారులు అడ్డుకున్నారు. ఈ సంఘటన జిల్లాలోని వెల్గటూర్ మండలంలోని గుల్లకోట గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ఓ 18 సంవత్సరాల లోపు అమ్మాయికి గొల్లపల్లి మండలంలోని దమ్మన్నపేట గ్రామానికి చెందిన మేజర్ అబ్బాయికి ఇచ్చి బాల్య వివాహం చేస్తున్నారని అధికారులకు సమాచారం అందింది.
వెంటనే స్పందించిన అధికారులు తహసీల్దార్, ఐసీడీఎస్ సీడీపీవో, సూపర్ వైజర్, అంగన్వాడీ టీఆచర్స్ టీచర్స్ ,చైల్డ్ లైన్ 1098 జిల్లా కో ఆర్డినేటర్, పోలీసులు బాలిక ఇంటికి వెళ్లి వయసును నిర్ధారించుకున్నారు.
అమ్మాయికి 18 సవత్సరాలు నిండిన తర్వాతనే వివాహం చేయాలని, లేదంటే అమ్మాయికి శారీరకంగా సమస్యలుంటాయి బాలిక, బాలిక తల్లిదండ్రులకు అధికారులు కౌన్సిలింగ్ నిర్వహించారు. లేదంటే చట్టరీత్యా చర్యలు ఉంటాయని హెచ్చరించారు.