వేములవాడ, డిసెంబర్ 18 : వేములవాడ రాజన్న ఆలయానికి సంబంధించి పలు విభాగాల టెండర్లను రద్దు చేయాలని కాంట్రాక్టర్లు ఇప్పటికే అధికారులకు వినతిపత్రం అందజేశారు. సమ్మక సారలమ్మ జాతరను దృష్టిలో పెట్టుకొని రెండేళ్లకోసారి ఆలయంలోని పలు విభాగాల హకులు దకించుకునేందుకు టెండర్లు నిర్వహిస్తుంటారు. అందులో భాగంగానే 2025-27 సంవత్సరాలకుగాను సుమారు 9.31 కోట్ల టెండర్లు దకించుకున్న కాంట్రాక్టర్లు, ఇప్పుడు రద్దు చేయాలని కోరడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అయితే, టెండర్లు నిర్వహించే క్రమంలో ఒకవేళ రాజన్న ఆలయాన్ని అభివృద్ధి పేరిట మార్చాల్సి వస్తే.. కాంట్రాక్ట్ రద్దు చేసుకునే అవకాశాన్ని అప్పటి అధికారులు కల్పించారు. ప్రస్తుతం రాజన్న ఆలయానికి సమ్మక భక్తుల తాకిడి అధికంగా ఉంటుందని భావించినా.. ఆలయంలో సమ్మక భక్తులకు దర్శనాల ఏర్పాట్ల విషయంలో స్పష్టత లేకపోవడంతో 25 రోజుల క్రితమే టెండర్లు రద్దు చేయాలని కాంట్రాక్టర్లు కోరినట్లు తెలిసింది. దీంతో ఏడాది పూర్తి చేసుకున్న టెండర్లను రద్దు చేయాలని అధికారులు భావించడంతోపాటు భీమేశ్వర ఆలయంలో హకుల పేరిట నూతన టెండర్లు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు.
రాజన్న ఆలయంలో హకులు దకించుకున్న పలు కాంట్రాక్టర్లు రద్దు చేసుకున్న టెండర్ల వివరాలిలా ఉన్నాయి. కొబ్బరి ముకలు రాజన్న ప్రధాన ఆలయంలో పోగు చేసుకునే హకు కోటి 70 లక్షలు, అనుబంధ ఆలయాల్లో కొబ్బరి ముకలు పోగు చేసుకునే హకు కోటి 21లక్షలు, రాజన్న కోడెలకు పచ్చి గడ్డి అరటిపండ్లు అమ్ముకునే హకు కోటి 71 లక్షలు, పూజా సామగ్రి, బెల్లం అమ్ముకునే హకు 2 కోట్ల 66 లక్షలు, ధర్మగుండంలో కొబ్బరి ముకలు పోగు చేసుకునే హకు కోటి 56 లక్షలుగా ఉన్నది. ప్రస్తుతం ఈ టెండర్లు రెండు సంవత్సరాలకు ఉన్నాయి. అయితే, వీటిని కాంట్రాక్టర్ల కోరిక మేరకు ఆలయ అధికారులు రద్దు చేస్తున్నారు. జనవరి, ఫిబ్రవరి వరకు ఏడాది పూర్తి కావస్తున్న సందర్భంగా.. అకడి వరకు రావాల్సిన బకాయిలను వసూలు చేసుకొని, టెండర్లు తిరిగి నిర్వహించేందుకు రెడీ అయ్యారు.
కాంట్రాక్టర్లు వదులుకున్న పలు టెండర్లను భీమేశ్వరాలయంలో హకుల పేరిట ఈ నెల 30న టెండర్లు, వేలం పాట నిర్వహించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఇకపై ఏడాది హకులు దకించుకునేలా ప్రస్తుతం టెండర్లు కోరేందుకు రెడీ అయ్యారు. అందు లో కొబ్బరి ముకలు భీమేశ్వరాలయంతో పాటు బద్ది పోచమ్మ, రాజన్న ఆలయం ముందు ప్రచార రథం, ఇతర అనుబంధ ఆలయాల్లో సేకరించుకునేందుకు అనుమతినిస్తున్నారు. భీమేశ్వర ఆలయంలో కోడెమొక్కు చెల్లించుకునే భక్తులకు పచ్చి గడ్డి, అరటి పండ్లు అమ్ముకునే హకు, భక్తుల సామగ్రి భద్రపరచు హకు, బెల్లం, పూజా సామగ్రి అమ్ముకునే హకు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఏర్పాటు హకుల కోసం టెండర్లను ఆహ్వానిస్తున్నారు. అయితే, రాజన్న సన్నిధిలో టెండర్ల ద్వారా దకిన ఆదాయం రాబట్టాలని అధికారులు చూస్తుండగా, భక్తుల సంఖ్యకు అనుగుణంగా సరైన ఏర్పాట్లు లేకపోవడంతో టెండర్లపై కాంట్రాక్టర్లు ఆసక్తి చూపుతారా.. లేదా? అన్నది చూడాల్సి ఉన్నది.