Koppula Eshwar | పింఛన్ల సొమ్ము పెంపు హామీని అమలు చేయకుండా కొత్త మంజూరు పేరుతో నాటకాలు.. మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్
అధికారంలోకి వస్తే వృద్ధాప్య దివ్యాంగుల పింఛన్ల సొమ్మును పెంచుతామని గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రజలకు హామీ ఇచ్చారని, ఈ వాగ్దానానికి కట్టుబడి ఉండకుండా ఇప్పుడు కొత్త పింఛన్ల మంజూరు పేరుతో నాటకాలు ఆడుతున్నారని బీఆర్ఎస్ రాష్ట్ర నేత, రాష్ట్ర మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ విమర్శించారు.
- మూడేండ్లైన హామీని ఎందుకు నెరవేర్చలేదో ప్రభుత్వం సమాధానం చెప్పాలి
Koppula Eshwar | ధర్మారం, నవంబర్ 16 : తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే వృద్ధాప్య దివ్యాంగుల పింఛన్ల సొమ్మును పెంచుతామని గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రజలకు హామీ ఇచ్చారని, ఈ వాగ్దానానికి కట్టుబడి ఉండకుండా ఇప్పుడు కొత్త పింఛన్ల మంజూరు పేరుతో నాటకాలు ఆడుతున్నారని బీఆర్ఎస్ రాష్ట్ర నేత, రాష్ట్ర మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ విమర్శించారు. పెద్దపెల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్ధ పాలన తీరుపై ఆయన మండిపడ్డారు. పేదలంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి చులకన అయిపోయిందని ఆయన పేర్కొన్నారు.
స్వరాష్ట్రంలో తొలి సీఎం కేసీఆర్ పేదల సంక్షేమం కోసం అనేక పథకాలను అమలు చేసి అందులో నిరుపేద వృద్ధులకు, వితంతువులకు, దివ్యాంగులకు, బీడీ కార్మికులకు, ఒంటరి మహిళలకు, గీత ,నేత కార్మికులకు తో పాటు తొమ్మిది రకాల పింఛన్లను అందించిన ఘనత అప్పటి తమ ప్రభుత్వానికే ఉందని అన్నారు. 43 లక్షల అర్హులైన వారికి పింఛన్లను బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఇవ్వడం జరిగిందని ఆయన గుర్తు చేశారు. కానీ రేవంత్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అధికారంలోకి రావడానికి అడ్డమైన వాగ్దానాలు చేశాడని అందులో భాగంగానే ప్రభుత్వం అధికారంలోకి వస్తే వృద్ధాప్య ఇతర పింఛన్ల సొమ్మును రూ .2,000 నుంచి రూ.4,000 పెంచుతామని, అదేవిధంగా దివ్యాంగులకు రూ.4,000 నుంచి రూ.6,000 పెంచుతామని రేవంత్ రెడ్డి వాగ్దానం చేశారని అన్నారు. దీనిని ఎన్నికల ప్రణాళికలో కూడా చేర్చారని అన్నారు. కానీ దాదాపు మూడేళ్ల కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో పింఛన్ల సొమ్ము పెంపును ఎందుకు అమలు చేయలేదని ఆయన ప్రశ్నించారు. నిరుపేదలపై కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధిలేని లేదనేది స్పష్టమైందని ఆయన పేర్కొన్నారు. మూడేళ్ల పాలనలో కొత్త పింఛన్లను ఎందుకు మంజూరు చేయలేదని మాజీ మంత్రి ఈశ్వర్ ప్రశ్నించారు.
గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పింఛన్ పొందిన వృద్ధులు మరణిస్తే వారి స్థానంలో వారి కుటుంబంలో అర్హులైన వారికి బదిలీ చేసి పింఛన్లు ఇవ్వడం జరిగిందని ఆయన గుర్తు చేశారు. మూడేళ్ల కాలంలో ఎంతోమంది వృద్ధులు మరణిస్తే వారి స్థానంలో ఇప్పటివరకు ఎందుకు అర్హులైన వారికి ఇవ్వలేదని ఆయన ప్రశ్నించారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం పై ప్రజల్లో వ్యతిరేకత రావడంతో దానిని కప్పిపుచ్చుకోవడానికి కొత్త పింఛన్ల మంజూరు పేరుతో కొత్త నాటకానికి తెర లేపారని ఆయన ఎద్దేవా చేశారు. కొత్త పింఛన్ల మంజూరులో అర్హులైన వృద్ధాప్య బీడీ కార్మికుల నుంచి ఎందుకు దరఖాస్తులు తీసుకోవడం లేదని మాజీ మంత్రి ఈశ్వర్ ప్రశ్నించారు. ప్రభుత్వ వైఖరి వలన నేడు వృద్ధులు, బీడీ కార్మికులు పింఛన్లు రాకుండా నష్టపోయే అవకాశం ఏర్పడిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వానికి పేదలపై ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్న అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీపై కట్టుబడి ఉండి వృద్ధాప్య పింఛన్లు రూ.4 వేలు, దివ్యాంగులకు రూ.6 వేలు సొమ్ము పెంచుతూ ఉత్తర్వులు జారీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. పింఛన్ల సొమ్ము పెంచి వాటిని కొత్త పింఛన్ల అర్హులకు కూడా అందజేయాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఆయన వెంట నంది మేడారం ప్యాక్స్ చైర్మన్ ముత్యాల బలరాంరెడ్డి, ఏఎంసీ మాజీ చైర్మన్లు కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి, గుర్రం మోహన్ రెడ్డి, పార్టీ మాజీ మండలాధ్యక్షుడు రాచూరి శ్రీధర్, విండో డైరెక్టర్ భారత స్వామి వార్డు సభ్యుడు నారా ప్రేమ్ సాగర్ పార్టీ నాయకులు తుమ్మల రాంబాబు, ఎగ్గేల స్వామి, కూరపాటి శ్రీనివాస్, ఆవుల శ్రీనివాస్, నేరెళ్ల చిన్న లచ్చయ్య, అర్ధవెల్లి రాము, బోయిని మల్లేశం, బోయిని రాజకుమార్, సుంచు ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | కోడిగుడ్డు పచ్చసొన తింటే ఒంట్లో చెడు కొవ్వు పెరుగుతుందా.. ?
Foods In Fridge | ఆహారాలను ఫ్రిజ్లో ఉంచి పదే పదే వేడి చేసి తింటున్నారా.. ఎలాంటి వ్యాధులు వస్తాయంటే..?
డైవర్షన్ రోడ్డును పునఃరుద్దరించాలని కంపగూడెం గ్రామస్తుల ధర్నా
Tamil Nadu | తమిళనాడులో ఘోరం.. చేపలు పట్టడానికి వెళ్లి, చెరువులో మునిగి.. ముగ్గురు బాలురు దుర్మరణం..!
ఆదమరిచి అడుగేస్తే వైకుంఠపాళీనే!
ట్రెండింగ్ వార్తలు
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి

