Peddapally | పెద్దపల్లి రూరల్ డిసెంబర్ 6 : పెద్దపల్లి మండలం రాఘవాపూర్ గ్రామ పరిధిలో జిల్లా కోర్టు భవన సముదాయాల నిర్మాణం కోసం కేటాయించిన సర్వే నంబర్ 1072 లోని 10 ఎకరాల స్థలాన్ని హైకోర్ట్ జడ్జీ, పోర్ట్ ఫోలియో జడ్జీ లక్ష్మీనారాయణ, పలువురు జిల్లా జడ్జీలు శనివారం పరిశీలించారు.
ఈ సందర్భంగా జిల్లా కోర్టు భవన సముదాయ నిర్మాణం కోసం ప్రభుత్వం కేటాయించిన స్థలం 10 ఎకరాల విస్తీర్ణం ఉండడంతో నలుదిక్కులా జిల్లా జడ్జీలు, న్యాయవాదులతో కలిసి కాలినడకన తిరుగుతూ పరిశీలించి స్థానికులను, రెవెన్యూ అధికారులను, న్యాయవాదుల నుంచి వివరాలు తెలుసుకున్నారు.
హైకోర్టు జడ్జి వెంట జిల్లా జడ్జి సునీత కుంచాల, పెద్దపల్లి ఆర్ డీవో బొద్దుల గంగయ్య, పెద్దపల్లి జోన్ డీసీపీ భూక్యా రామ్ రెడ్డి, పెద్దపల్లి ఏసీపీ గజ్జి కృష్ణ యాదవ్, తహసీల్దార్ దండిగ రాజయ్య యాదవ్, ఎస్సై మల్లేష్, గ్రామ మాజీ సర్పంచ్ ఆడెపు వెంకటేశం, న్యాయవాదులు లకిడి భాస్కర్, కోటగిరి శ్రీనివాస్, ఉప్పు రాజు, రాచూరి శ్రీకాంత్, బర్ల రమేష్, పుట్ట రవికుమార్, రమేష్ యాదవ్ , పొలగాని సతీష్ యాదవ్, బొంకూరి బాబ్జీ, సంతోష్, గ్రామస్తులు, నాయకులు పాల్గొన్నారు.