Appointed | చిగురుమామిడి, మే 30: కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం ఇందుర్తి ప్రభుత్వం ఉన్నత పాఠశాలలో సైన్స్ ఉపాధ్యాయుడు భాషబత్తిని ఓదెల కుమార్ బోధనలో అత్యధిక సాంకేతికథ జోడించి, బోధన చేయాలని రాష్ట్ర విద్యాశాఖ పరిశీలకుడిగా ఎస్సీఆర్టీ ద్వారా రాష్ట్ర విద్యాశాఖ పరిశీలకుడిగా నియమితులయ్యారు.
ఈనెల 13 నుండి 31 వరకు ఉమ్మడి జిల్లాలోని నిర్మల్, అదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లా కేంద్రాల్లోని వివిధ పాఠశాలలు నిర్వహిస్తున్న భౌతిక, రసాయన శాస్త్ర ఉపాధ్యాయ శిక్షణ శిబిరాలను సందర్శించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్యను అందించేందుకు శిక్షణ కార్యక్రమాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
పాఠశాలలో విద్యార్థులకు ఆసక్తి కలిగేలా అత్యాధునిక సాంకేతిక పద్ధతులను బోధనలో వినియోగించాలని, నూతన వరవడితో బోధించాలని, పరిసరాలలో లభించి టీఎల్ఎంను ఎన్నో ఉపయోగించాలని వివరించారు. ఈ శిక్షణ కార్యక్రమంలో సైన్స్ అధికారులు, కోర్సు డైరెక్టర్లు, జిల్లా రిసోర్స్ పర్సన్ లు పాల్గొంటారని ఓదేలు కుమార్ తెలిపారు.
కాగా రాష్ట్ర విద్యాశాఖ పరిశీలకుడిగా ఓదెలు కుమార్ నియామకం పట్ల మండలంలోని రేకొండ స్వగ్రామంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయ బృందం, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.