Jagityal | వైజ్ఞానిక రంగంలో భారత్ దే అగ్రస్థానం.. ఆర్ఎస్ఎస్ విభాగ్ సంఘచాలక్ డాక్టర్ బీ శంకర్
ప్రాచీన కాలం నుండి శాస్త్ర, సాంకేతిక, వైద్య, విజ్ఞాన రంగంలో భారత్ దేశమే అగ్రగామిగా ఉండేదని ఆర్ఎస్ఎస్ కరీంనగర్ విభాగ్ సంఘచాలక్ డాక్టర్ భీమనాత్ని శంకర్ అన్నారు. జగిత్యాల వాల్మీకి ఆవాసం సేవా భారతి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత కంప్యూటర్ శిక్షణ కేంద్రాన్ని సోమవారం ప్రారంభించారు.
Jagityal | జగిత్యాల, మే 05 : ప్రాచీన కాలం నుండి శాస్త్ర, సాంకేతిక, వైద్య, విజ్ఞాన రంగంలో భారత్ దేశమే అగ్రగామిగా ఉండేదని ఆర్ఎస్ఎస్ కరీంనగర్ విభాగ్ సంఘచాలక్ డాక్టర్ భీమనాత్ని శంకర్ అన్నారు. జగిత్యాల వాల్మీకి ఆవాసం సేవా భారతి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత కంప్యూటర్ శిక్షణ కేంద్రాన్ని సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డాక్టర్ శంకర్ మాట్లాడుతూ భారత దేశంలో మేధోసంపదకు కొదవ లేదని అయితే మేదో సంపత్తిని వెలికి తీసే నాయకత్వం అవసరమని తెలిపారు.
ఆర్యభట్ట, భాస్కరాచార్య, వరాహమిహిర, శుశ్రుతుడు, కణాధుడు లాంటి ప్రాచీన శాస్త్రవేత్తలు ప్రపంచానికి అవసరమైన ఎన్నో ఆవిష్కరణలు అందజేశారని తెలిపారు. ఆధునిక కాలంలో కూడా జగదీష్ చంద్రబోస్, అబ్దుల్ కలాం, నంబి నారాయణన్ లాంటి వారు మన వైజ్ఞానిక, శాస్త్ర, సాంకేతిక రంగాలను బలోపేతం చేశారని తెలిపారు. ప్రస్తుతం ప్రపంచంలోని 21 అగ్రశ్రేణి కంపెనీలకు సీఈవోలుగా భారతీయులే ఉన్నారని తెలిపారు.
స్వదేశంలో మన మేధావులకు సరైన ప్రోత్సాహం లభించకపోవడంతో భారతీయుల మేధో సంపదను ఇతర దేశాలవారు ఉపయోగించుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పరిసరాలను, ప్రకృతిని నిశితంగా పరిశీలించడం ద్వారా, కొత్త విషయాలను తెలుసుకోవాలనే జిజ్ఞాస ద్వారా మేధో సంపద వికసిస్తుందని తెలిపారు. ప్రస్తుత కాలంలో కంప్యూటర్ విద్య తెలియని వారిని ఎన్ని డిగ్రీలు ఉన్నా నిరక్షరాస్యులు గానే పరిగణిస్తారన్నారు.
రోజురోజుకు శాస్త్ర సాంకేతిక రంగం అభివృద్ధి చెందుతున్న దృష్ట్యా ప్రతీ ఒక్కరూ కంప్యూటర్ విద్యను అభ్యసించాలని సూచించారు. వాల్మీకి ఆవాసం సేవా భారతి ద్వారా నిర్వహిస్తున్న ఉచిత కంప్యూటర్ శిక్షణను ప్రతీ ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. 35 రోజుల పాటు నిర్వహించే ఉచిత కంప్యూటర్ శిక్షణలో 125 మంది విద్యార్థిని విద్యార్థులు శిక్షణ పొందనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప్రముఖ వ్యాపారవేత్త కోటగిరి అరవింద్ హాజరుకాగా వాల్మీకి ఆవాసం అధ్యక్షులు జడిగే పురుషోత్తం, కార్యదర్శి నందెల్లి మదన్ మోహన్ రావు, కమిటీ సభ్యులు సంపూర్ణ చారి, కంప్యూటర్ శిక్షణ ఇన్చార్జ్ బెక్కం మల్లేశం బొమ్మెర సత్యనారాయణ, మల్లేశం తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
- Tags
- India
- Jagityal
- Karimnagar
- science
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs WI T20I | ఉప్పల్లో ఇండియా వర్సెస్ వెస్టిండీస్ టీ20.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
Gadwal Accident Victims | కేసీఆర్ సార్ బాగున్నారా.. హరీశ్ రావుతో గద్వాల ప్రమాద బాధితులు.. వీడియో
KTRs Meeting | కేటీఆర్ సభకు భారీగా తరలిన బీఆర్ఎస్ శ్రేణులు
Modi Cabinet | రైల్వే ఉద్యోగులకు మోదీ క్యాబినెట్ శుభవార్త.. 78 రోజుల బోనస్ ప్రకటన
మేగ్యతండాలో మహిళా శక్తి భవనం పరిశీలన
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

