Independence Day | రామగిరి, ఆగస్టు 15: స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం రామగిరి మండల కేంద్రం తోపాటు పల్లెపల్లెల్లో ఘనంగా జాతీయ పండుగ జరుపుకున్నారు. ఉదయం నుంచే పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు, గ్రామ చౌరస్తాలు వివిధ రాజకీయ పార్టీల ఆఫీస్ ల వద్ద జాతీయ జెండాలతో అలంకరించబడ్డాయి. గ్రామ ప్రజా ప్రతినిధులు, అధికారులు కలిసిజాతీయ జెండాలను ఆవిష్కరణ చేశారు.
అయా పాఠశాల లో పిల్లలు దేశభక్తి గీతాలు పాడగా, విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలతో వేడుకకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వీరమరణం పొందిన స్వాతంత్ర్య సమరయోధులను స్మరించుకుంటూ నివాళులు అర్పించారు. యువతలో దేశభక్తి చైతన్యం పెంచేందుకు ర్యాలీలు, క్రీడా పోటీలు నిర్వహించారు. విద్యార్థులు త్రివర్ణ పతాకాలను ఊపుతూ “జై హింద్” నినాదాలతో ఉత్సాహాన్ని ప్రదర్శించారు.