దేవీ నవరాత్రోత్సవాలను పురస్కరించుకుని రాజన్న ఆలయంలోని ధర్మగుండంలో తెప్పోత్సవాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. నాగిరెడ్డి మండపంలో కొలువుదీరి మహాగౌరీ అలంకారంలో దర్శనమిచ్చిన అమ్మవారు ఆదివారం రాత్రి తెప్పపై జలవిహారం చేశారు.
మంగళవాయిద్యాలు, వేదమంత్రోచ్ఛారణల మధ్య గుడిచెరువులో మూడుసార్లు తిరిగి భక్తులను కటాక్షించారు. అనేక మంది భక్తులు ఈ తెప్పోత్సవాన్ని వీక్షించి తన్మయత్వం చెందారు.
– వేములవాడ టౌన్, అక్టోబర్ 22