ఎట్లున్న చిగురుమామిడి.. ఎట్లైంది
నాడు సాగునీరందక, తాగునీరులేక, కనీస సౌకర్యాలు కరువైన చిగురుమామిడి మండలం నేడు పచ్చని పంటలతో కళకళలాడుతున్నదని హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీశ్‌కుమార్ పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ అహోరాత్రులు శ్రమించి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుతో చిగురుమామిడి పచ్చబడ్డదని పేర్కొన్నారు.
- చిగురుమామిడి: మాట్లాడుతున్న ఎమ్మెల్యే సతీశ్‌కుమార్
- కాళేశ్వరంతో పచ్చబడ్డది
- పచ్చని పంటలతో కళకళలాడుతున్నది
- ప్రజలు గుర్తించి పనిచేసేవారికి పట్టంగట్టాలి
- నాయకులు సమన్వయంతో ముందుకెళ్లాలి
- ఎమ్మెల్యే వొడితల సతీశ్‌కుమార్
- బొమ్మనపల్లి బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం
చిగురుమామిడి (తిమ్మాపూర్), మే 27 : నాడు సాగునీరందక, తాగునీరులేక, కనీస సౌకర్యాలు కరువైన చిగురుమామిడి మండలం నేడు పచ్చని పంటలతో కళకళలాడుతున్నదని హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీశ్‌కుమార్ పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ అహోరాత్రులు శ్రమించి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుతో చిగురుమామిడి పచ్చబడ్డదని పేర్కొన్నారు. ప్రజలు అభివృద్ధి పనులను గుర్తించి పనిచేసేవారికే పట్టంగట్టాలని పిలుపునిచ్చారు. చిగురుమామిడి మండలం బొమ్మనపల్లిలో శనివారం ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనానికి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావుతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వం లో తెలంగాణ రాష్ట్రం దేశానికే దిక్సూచిగా మారిందని చెప్పారు. స్వరాష్ట్రంలో రైతుల దశ తిరిగిందని చెప్పారు. ఉమ్మడి పాలనలో పండించిన పంట ఉ త్పత్తులను అమ్ముకొనేందుకు అరిగోస పడ్డ రైతులు, నేడు ఏ రందీలేకుండా వ్యవసాయం చేసుకుంటున్నారని చెప్పారు. విత్తనాల పంపిణీ నుంచి పంటలను అమ్ముకొనేదాకా సర్కారు అండగా ఉన్నదని స్పష్టం చేశారు. అన్నదాత అభ్యున్నతే లక్ష్యం గా 24 గంటల ఉచిత కరెంట్, రైతుబంధు, రైతుబీ మా లాంటి పథకాలను అమలు చేస్తున్నదని చెప్పా రు. ప్రభుత్వం గురించి మాట్లాడే ప్రతిపక్ష నాయకులు.. వారి పార్టీలు పాలించే రాష్ర్టాల్లో ఇలాంటి పథకాలు ఎందుకు అమలు చేయడం లేదని ప్ర శ్నించారు. పనిచేయనివారే పిచ్చికూతలు కూస్తారని, వారిని పట్టించుకోవద్దని ప్రజలకు సూచించా రు.
ఉమ్మడి పాలనలో తాను ఇక్కడి గ్రామాల్లో పర్యటించిన సందర్భాల్లో ఇండ్లల్లో వృద్ధులు తప్పా, యువకులు, పిల్లలు కనిపించకపోయేదన్నారు. అ ప్పుడు గ్రామాల్లో అడిగితే పనుల కోసం పట్టణా లు, ఇతర దేశాలకు వెళ్లారని చెప్పేవారని గుర్తు చేశారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక తాను ఎమ్మెల్యేగా గెలిచాక కరువు ప్రాంతమైన చిగురుమామిడి మండలానికి కాళేశ్వరం జలాలు తీసుకువచ్చామని, ఈ ప్రాంతం పంటలతో పరిఢవిల్లుతున్నదన్నారు. పొట్ట కూటికోసం వివిధ పనులకు వెళ్లిన వారు నేడు సొంత గ్రామాలకు తిరిగి వచ్చి సంతోషంగా బతుకుతున్నారని పేర్కొన్నారు. ఎవరికి ఏ పని ఉన్నా తన నంబర్ 9849600003కు ఫోన్ చేయాలని చెప్పారు. ఈ సందర్భంగా సతీశ్‌కుమా ర్, జీవీఆర్, నారదాసు లక్ష్మణ్‌రావును మండల నాయకులు ఘనంగా సత్కరించారు. అనంతరం రేకొండ, రామంచ గ్రామాలకు చెందిన పలువురు బీఆర్ఎస్లో చేరగా, గులాబీ కండువాలు కప్పి ఆహ్వానించారు. తదనంతరం కార్యకర్తలు, నాయకులతో కలిసి భోజనం చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ కొత్త వినీత, జడ్పీటీసీ గీకురు రవీందర్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మామిడి అంజయ్య, సింగిల్ విండో చైర్మన్ వెంకటరమణారెడ్డి, వైస్ ఎంపీపీ బేతి రాజిరెడ్డి, నాయకులు కొత్త శ్రీనివాస్‌రెడ్డి, సాంబారి కొమురయ్య, రామోజు కృష్ణమాచారి, మైనార్టీ సెల్ మండలాధ్యక్షుడు సర్వర్ పాషా పాల్గొన్నారు.
చిగురుమామిడి గడ్డా.. బీఆర్ఎస్ అడ్డా
చిగురుమామిడి బీఆర్ఎస్ అడ్డా. ఇక్కడి ప్రజలకు బీఆర్ఎస్పై అపారమైన అభిమానం ఉన్నది. పార్టీ ఏ పిలుపునిచ్చినా పెద్దసంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేస్తున్నరు. నాపై, పార్టీపై ప్రేమను చూపించే చిగురుమామిడి ప్రజల రుణం ఏమిచ్చినా తీర్చుకోలేనిది. గౌరవెళ్లి ప్రాజెక్ట్ నిర్మాణంతో ఈ ప్రాంతం గొప్పగా అభివృద్ధి చెందుతున్నది. నాయకులు ప్రజలతో మమేకమై పార్టీ బలోపేతానికి కృషి చేయాలి. చిగురుమామిడి మండల ఆత్మీయ సమ్మేళనం అన్ని మండలాల కంటే గొప్పగా జరిగింది. విజయవంతం చేసిన కార్యకర్తలకు కృతజ్ఞతలు.
– ఎమ్మెల్యే సతీశ్‌కుమార్
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP Protest | 7వేల మంది అరెస్ట్.. నిరసనపై కేంద్రం నిర్బంధకాండ.. సీజేపీ ఆందోళనలపై ఉక్కుపాదం
Power Cuts | కాంగ్రెస్ మీటింగ్‌కు కరెంట్ షాక్.. మంత్రి పొంగులేటి మాట్లాడుతుండగా పవర్ కట్
Gajwel | నువ్వింకా చావలేదా?.. పురుగుమందు తాగలేదా?.. రైతును అవహేళన చేసిన తహసీల్దార్
Bullet Train | బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదనలకు ముందే భూసేకరణ షురూ.. కేంద్రం స్పష్టతతో బట్టబయలైన రేవంత్‌రెడ్డి బాగోతం
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

