Peddaally | పెద్దపల్లి, అక్టోబర్26 : ఇటీవల జరిగిన రిక్రియేషన్ క్లబ్ నూతన కార్యవర్గ ఎన్నికల్లో ప్రధాన కార్యదర్శిగా విజయం సాధించిన సీనియర్ జర్నలిస్టు కొట్టె సదానందంను ప్రెస్ క్లబ్ లో ఆదివారం తోటి జర్నలిస్టులు ఘనంగా సన్మానించారు. ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు గుడ్ల శ్రీనివాస్ మాట్లాడుతూ భవిషత్లో మరిన్ని విజయాలను సొంతం చేసుకోవాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి కొల్లూరి గోపాల్, ఉపాధ్యక్షులు బెజ్జంకి నరేష్, తిర్రి తిరూపతి గౌడ్, కోశాధికారి ఆరెళ్లి మల్లేష్, కీర్తి రమేష్, లైశెట్టి రాజు, కత్తెర్ల తిరుపతి యాదవ్, శిలారపు కిషన్, ఇజ్జగిరి వెంకటేష్, మారుపాకల అంజన్న, నల్లారపు తిరుపతి, నాగపూరి తిరుపతి గౌడ్, సంతోష్, లచ్చన్న, తిర్రి సుధాకర్ గౌడ్, కళ్యాణ్, నగునూరి శ్రీనివాస్, తోట సతీష్, కత్తెరల చందర్, మచ్చార్ల వంశీ, కొయ్యాడ తిరుపతి తదితరులు పాల్గొన్నారు.