Manthani | మంథని, జనవరి 2: స్థానిక శ్రేష్ఠ కిడ్స్ పాఠశాలలో శ్రేష్ఠ అనే విద్యార్థిని గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డులో చోటు సాధించకున్న విద్యార్థినిని తోటి విద్యార్థులు, ఉపాధ్యాయులు శుక్రవారం ప్రత్యేకంగా అభినందించారు. హైదరాబాద్లోని గడ్చిబౌలి స్టేడియంలో కూచీపూడి కళా వైభవం భారత్ ఆర్డ్ ఆకాడమీ నిర్వహించిన మహాబృంద నాట్యం కార్యక్రమంలో పాల్గొన్న శ్రేష్ఠ కూచీపూడి నాట్యంలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చి గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డులో చోటు దక్కించుకుంది.
ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు శ్రేష్ఠను ప్రత్యేకంగా అభినందించడంతో పాటు శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ క్రాంతికుమార్, ప్రిన్సిపాల్ బిందు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.