చొప్పదండి, డిసెంబర్ 9: వరికి బదులు ఇతర పంటల సాగుతోనే అధిక లాభాలు గడించవచ్చని మండల వ్యవసాయాధికారి వంశీకృష్ణ పేర్కొన్నారు. మండలంలోని ఆర్నకొండలో గురువారం రైతులకు పంటమార్పిడి విధానం, ఇతర పంటల సాగుపై అవగాహన కల్పించారు. పంటమార్పిడితో అధిక దిగుబడులు సాధించవచ్చని పేర్కొన్నారు. వరికి బదులు ఆరుతడి పంటలైన పెసర, మినుము, నువ్వులు వంటి పంటలను సాగుచేసుకోవాలని సూచించారు.
ఆరుతడి పంటలపై దృష్టిపెట్టాలి..
రైతులు యాసంగిలో ఆరుతడి పంటలతో అధిక లాభం పొందవచ్చని మండల వ్యవసాయ అధికారి సత్యం రైతులకు పిలుపునిచ్చారు. బుధవారం కరీంనగర్ మండలంలోని నగునూర్ క్లస్టర్‌లోని తీగలగుట్టపల్లి, పల్లంపహడ్, దుర్శేడ్ క్లస్టర్ పరిధి లోని గోపాల్పూర్, మొగ్దుంపూర్ క్లస్టర్లలో యా సంగి సాగుపై రైతులకు గురువారం అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈసందర్భంగా ఏవో మాట్లాడుతూ యాసంగిలో వరికి బదులుగా ఇతర పంటలు సాగు చేయాలని సూచించారు. కందులు, పల్లి, పెసర్లు సాగు చేయాలని కోరారు. విత్తనాలను అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. అనంతరం ఏఈవో జాఫరుల్లా వల్లంపహడ్, మొగ్దంపూర్ నగునూర్, తీగలగుట్టపల్లిలో రైతులు సాగు చేస్తున్న మక్కజొన్న, వేరుశనగ పంటలను సం దర్శించారు. మొగ్దుంపూర్ లో ఏఈవో స్వర్ణలత ఆధ్వర్యంలో రైతులకు ఆరుతడి పంటలపై అవగా హన సదస్సు నిర్వహించారు. కార్యక్రమంలో రైతు బంధు కోఆర్డినేటర్ మంద తిరుపతి, ఉప సర్పంచ్ తిరుపతి, ఆర్బీఎస్ మండల కోఅర్డినేటర్ జగన్మోహన్ పాల్గొన్నారు. దుర్శేడ్ క్లస్టర్ పరిధిలోని గోపాల్‌పూర్‌లో జరిగిన కార్యక్రమంలో ఏఈవో రాకేశ్, దుర్శేడ్ సింగిల్ విండో వైస్ చైర్మన్ గోనె నర్సయ్య, రాజిరెడ్డి పాల్గొన్నారు.