MLA Dr. Sanjay Kumar | రాయికల్, మే, 28 : ప్రభుత్వం విద్యా వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పేర్కొన్నారు. రాయికల్ మండలం ఓడ్డే లింగాపూర్ గ్రామంలో గిరిజన సంక్షేమ మినీ గురుకులం పాఠశాలలో రూ.40 లక్షల నిధులతో అదనపు తరగతి గదుల నిర్మాణానికి బుధవారం ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు.
ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాయికల్ మండలం అభివృద్ధికి తనవంతుగా కృషి చేస్తానని అన్నారు. బోర్నపల్లి- జగన్నాధ పూర్ వంతెన ఇక్కడి ప్రజల చిరకాల కోరిక అని జగన్నాథ్ పూర్- బోర్న పల్లి బ్రిడ్జి నిర్మాణానికి ఢిల్లీలో కేంద్ర మంత్రులను కూడా కలిసినట్లు తెలిపారు. త్వరలోనే బ్రిడ్జి నిర్మాణానికి నిధులు మంజూరు అవుతాయన్నారు. ప్రజలకు నిరంతరం సేవ చేయడానికి రాజకీయాలలోకి వచ్చానని, ప్రజలకు అవసరమైన ప్రతీ పనికి రాజకీయాలతో సంబంధం లేకుండా అందరినీ కలుస్తూ పనులు చేస్తున్నానన్నారు.
రూ.12,600 కోట్లతో ‘ఇందిర సౌర గిరి జల వికాసం’ పథకం ద్వారా గిరిజన రైతులకు సాగునీరందిస్తున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదే అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో చిరంజీవి, ఎమ్మార్వో గణేష్, మాజీ మున్సిపల్ చైర్మన్ మోర హనుమాన్లు, సీనియర్ నాయకులు కోల శ్రీనివాస్, రవీందర్రావు, అచ్యుతరావు, గన్నెరాజిరెడ్డి ,అనుపురం శ్రీనివాస్ ,పడిగల రవీందర్ రెడ్డి, మాజీ సర్పంచ్ రవి, పిఏసిఎస్ వైస్ చైర్మన్ మల్లయ్య, యం ఏ ముకీద్,దుబ్బ రెడ్డి,శ్రీనివాస్ గౌడ్,తిరుపతి గౌడ్,గ్రామ మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.