దైవ సన్నిధిలో హైకోర్టు జడ్జి
- వేములవాడ, కొండగట్టులో కుటుంబ సమేతంగా పూజలు
వేములవాడ టౌన్/ మల్యాల, సెప్టెంబర్ 3: వేములవాడ రాజన్నను శనివారం హైకోర్టు జడ్జి ఇ.వి.వేణుగోపాల్ తన కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. స్థానాచార్యుడు అప్పాల భీమాశంకర్ ఆధ్వర్యంలో అర్చకులు వారితో ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం అద్దాల మండపంలో అర్చకులు వేదమంత్రాలతో ఆశీర్వచనం చేయగా, ఆలయ పర్యవేక్షకుడు తిరుపతిరావు వారికి స్వామివారి కండువా కప్పి, ప్రసాదాన్ని అందజేశారు. కాగా, అంతకుముందు జడ్జికి ఆలయ ప్రాంగణంలో కలెక్టర్ అనురాగ్ జయంతి, ఎస్పీ రాహూల్‌హెగ్డే పూలమొక్క అందించి స్వాగతం పలికారు.
వారి వెంట వేములవాడ సబ్ జడ్జి రవీందర్, జూనియర్ సివిల్ జడ్జి ప్రతీక్ సిహాగ్, వేములవాడ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సుధాకర్‌రెడ్డి, కార్యదర్శి గుడిసె సదానందం ఉన్నారు. అలాగే కొండగట్టు అంజన్న సన్నిధిలో హైకోర్టు జడ్జి పూజలు చేశారు. ముందుగా పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో గౌరవవందనం స్వీకరించారు. తర్వాత ప్రధాన ఆలయంలో ఆంజనేయస్వామి, వెంకటేశ్వరస్వామి, లక్ష్మి అమ్మవార్లను దర్శించుకున్నారు. తర్వాత ఆలయ ప్రాకార మండపంలో అర్చకులు తీర్థప్రసాదాలు అందజేసి, ఆశీర్వదించగా, అధికారులు శేషవస్త్రంతో సత్కరించారు. ఇక్కడ జగిత్యాల ఆర్డీవో మాధురి, డీఎస్పీ రత్నాపురం ప్రకాశ్, మల్యాల సీఐ రమణమూర్తి, ఎస్ఐ చిరంజీవి, తహసీల్దార్ సుజాత, ఆలయ ఈవో టంకశాల వెంకటేశం, ఆలయ పాలకమండలి చైర్మన్ తిరుక్కోవెళూర్ మారుతీస్వామీ, ఆలయ స్థానాచార్యుడు కపిందర్, ప్రధాన అర్చకులు రామకృష్ణ, వకుళాభరణం రఘు, ఉపప్రధాన అర్చకుడు చిరంజీవస్వామి, అర్చకులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
సింగరేణి జీఎం కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

