కొత్తపల్లి/చిగురుమామిడి/కార్పొరేషన్, జనవరి 1: జిల్లా వ్యాప్తంగా నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. పలుచోట్ల బీఆర్ఎస్ ఆధ్వర్యంలో కేకులు కోసి సంబురాలు నిర్వహించారు. టీఎన్జీవోల సంఘం జిల్లాశాఖ ఆధ్వర్యంలో పలువురు కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ పమేలా సత్పతిని కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. నిరుపేద విద్యార్థులకు ఉపయోగపడేలా నోటుపుస్తకాలు, పెన్నులు, పెన్సిళ్లు అందజేశారు. అంతకుముందు మాజీ ప్రధాని దివంగత మన్మోహన్సింగ్ సంతాప దినాలను పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూలమాల వేసి, ఘనంగా నివాళులర్పించారు.
నూతన సంవత్సర వేడుకల సంబురాల్లో టీఎన్జీవోల సంఘం జిల్లా అధ్యక్షుడు దారం శ్రీనివాసరెడ్డి, కార్యదర్శి సంగెం లక్ష్మణ్‌రావు, టీజీవోల సంఘం జిల్లా అధ్యక్షుడు మడిపల్లి కాళీచరణ్‌గౌడ్, కార్యదర్శి అరవింద్‌రెడ్డి, నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కోటరామస్వామి, శంకర్, పెన్షనర్ల సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు పెండ్యాల కేశవరెడ్డి, ఎలదాసరి లింగయ్య, టీఎన్జీవోల సంఘం ప్రతినిధులు ముప్పిడి కిరణ్‌కుమార్‌రెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, నాగుల నర్సింహస్వామి, ఒంటెల రవీందర్‌రెడ్డి, రాజేశ్‌భరద్వాజ్, సుమంత్‌రావు, గంగారపు రమేశ్, ప్రసాద్‌రెడ్డి, వాస్తవిక్, శ్రీమాన్‌రెడ్డి, పోలుకిషన్, కామ సతీశ్, కరుణాకర్, జలాలుద్దిన్, మన్మీత్సింగ్, బాస పవన్‌కుమార్, రాజేశ్వర్‌రావు, రామ్మోహన్, మహేందర్‌రెడ్డి, రాజూనాయక్, అభినయరెడ్డి, విజయ్, అస్గర్, కమలాకర్, లవకుమార్, సబిత, సునీత, శైలజ, విజయలక్ష్మి, శారద, హరిప్రియ పాల్గొన్నారు.
నూతన సంవత్సరాన్ని పురసరించుకొని హుస్నాబాద్, చిగురుమామిడి, సైదాపూర్, కోహెడ, అకన్నపేట్, భీమదేవరపల్లి, ఎలతుర్తి మండలాలకు చెందిన బీఆర్ఎస్ నాయకులు మాజీ ఎమ్మెల్యే వొడితల సతీశ్‌కుమార్‌ను ఆయన నివాసానికి వెళ్లి కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నూతన సంవత్సరంలో హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. శుభాకాంక్షలు తెలిపిన వారిలో బీఆర్ఎస్ జిల్లా నాయకుడు కొత్త శ్రీనివాస్ రెడ్డి, మండలాధ్యక్షుడు మామిడి అంజయ్య, మండల నాయకులు ఆకవరం శివప్రసాద్, బెజ్జంకి రాంబాబు, మాజీ సర్పంచులు జకుల రవి, బెజ్జంకి లక్ష్మణ్, బోయిని శ్రీనివాస్, ముప్పిడి వెంకట నరసింహారెడ్డి తదితరులు ఉన్నారు. కాగా, కొండాపూర్‌లో మాజీ సర్పంచ్, బీఆర్ఎస్ నాయకుడు పెద్దపెల్లి భవాని, అరుణ్ కుమార్, గునుకుల పల్లెలో మాజీ సర్పంచ్ గునుకుల అమూల్యా మధుసూదన్ రెడ్డి వేడుకలు ఘనంగా నిర్వహించారు. గ్రామంలో కేక్ కట్ చేసి, గ్రామస్తులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
నగరంలోని బీఆర్ఎస్ నగర కార్యాలయంలో నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని నిర్వహించిన వేడుకల్లో బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్ కేక్ కట్ చేసి, స్వీట్లు పంచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నూతన సంవత్సరంలో రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆనందంగా ఉండాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్, బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి గడ్డం ప్రశాంత్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ నగర మైనార్టీ అధ్యక్షుడు షౌకాత్, బీఆర్ఎస్ పార్టీ నగర యూత్ ప్రధాన కార్యదర్శి బోనకుర్తి సాయికృష్ణ, బీఆర్ఎస్ పార్టీ నగర మైనార్టీ ప్రధాన కార్యదర్శి వాజిద్, పార్టీ టౌన్ కమిటీ, డివిజన్ అధ్యక్షులు, నాయకులు పాల్గొన్నారు.