GVR birthday celebrations | మానకొండూర్, ఏప్రిల్ 7 : బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు జన్మదిన వేడుకలను మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ క్యాంప్ కార్యాలయంలో పార్టీ శ్రేణులు సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన జీవీఆర్ పార్టీ శ్రేణులతో కలిసి భారీ కేక్ కట్ చేశారు. అనంతరం జీవీఆర్ ను పార్టీ శ్రేణులు భారీ గజమాలతో సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు, మాజీ జెడ్పీటీసీ తాళ్లపల్లి శేఖర్ గౌడ్, మానకొండూరు సింగిల్ విండో అధ్యక్షుడు నల్ల గోవిందరెడ్డి, బీఆర్ఎస్వీ నియోజకవర్గ కన్వీనర్ గుర్రం కిరణ్ గౌడ్, కార్యదర్శి మర్రి అశోక్ యాదవ్, బీఆర్ఎస్ వై మండల అధ్యక్షుడు అడప శ్రీనివాస్, నాయకులు రామంచ గోపాల్ రెడ్డి, స్వామిరెడ్డి, శాతారాజు యాదగిరి, ఎరుకుల శ్రీనివాస్ గౌడ్, దండబోయిన శేఖర్, బొంగోని రేణుక, కోమల, ఆయా గ్రామాల మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీ సభ్యులు, మాజీ జెడ్పీటీసీ ఎడ్ల సుగుణాకర్, బీఆర్ఎస్ అనుబంధ సంఘాల నాయకులు, ఆయా గ్రామాల గ్రామ శాఖ అధ్యక్షులు, నాయకులు పాల్గొన్నారు.