రాయికల్ రూరల్, అక్టోబర్ 4: పట్టణంలో సద్దుల బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. మహిళలు తీరొక్క పూలతో బతుకమ్మలను పేర్చి ముఖ్య కూడళ్ల వద్ద బతుకమ్మలను ఉంచి పాటలతో ఆడిపాడారు. కోలాట నృత్యాలతో ఆకట్టుకున్నాయి. మున్సిపల్ ఆధ్వర్యంలో మహిళలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తగిన ఏర్పాట్లు చేశారు. అనంతరం సమీప చెరువుల్లో నిమజ్జనం చేశారు. మహిళలు ఒకరికొకరు వాయినాలు ఇచ్చుపుచ్చుకున్నారు.
సారంగాపూర్, బీర్పూర్ మండలాల్లో
సారంగాపూర్, బీర్పూర్ మండలాల్లోని ఆయా గ్రామాల్లో మంగళవారం బతుకమ్మ వేడుకలను వైభవంగా నిర్వహించారు. సారంగాపూర్ మండల కేంద్రంతో పాటు బీర్పూర్ మండలంలోని బీర్పూర్, నర్సింహులపల్లి, తుంగూర్ తదితర గ్రామాల్లో బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆయా గ్రామా ల్లో మహిళలు వివిధ రకాలపూలతో అందంగా పేర్చిన బతుకమ్మలను ముందు తమ ఇంటి ఎదుట వేసిన ముగ్గులో బతుకమ్మలను ఉంచి పాటలు పాడారు. అనంతరం ప్రధాన కూడళ్ల వద్ద బతుకమ్మలను ఉంచి ఒక్కేసి పువ్వేసి చందమామ.. చిత్తు చిత్తుల బొమ్మ… అంటూ మహిళలు పాటలు పాడుతూ బతుకమ్మ ఆడారు. అనంతరం ఆయా గ్రామాల్లోని చెరువులు, కుంటల్లో బతుకమ్మలను నిమజ్జనం చేశా రు. మహిళలు వాయినాలను ఇచ్చిపుచ్చుకున్నారు. కార్యక్రమాల్లో ఎంపీపీ మసర్తి రమేశ్, జడ్పీటీసీ పాత పద్మ-రమేశ్, ప్రజాప్రతినిధులు గుర్రాల రాజేంవర్ రెడ్డి, గర్షకుర్తి శిల్ప, రిక్కల ప్రభాకర్, గుడిసె శ్రీమతి, ఆడెపు మల్లేశ్వరి, ఎడ్ల సృజన, ఏలేటి గంగారెడ్డి, హరీశ్, ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు, నాయకులు, మహిళలు పాల్గొన్నారు.