Koppula Eswar | ధర్మారం మండలంలో ఘనంగా రక్షాబంధన్ వేడుకలు
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం లో శుక్రవారం రాఖీ పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. సోదరీమణులు తమ అన్నలు, తమ్ముళ్లకు రాఖీలు కట్టి వారిపై అక్షింతలు వేసి దీవించారు. సోదరులు పెట్టిన కట్న కానుకలను సోదరీమణులు స్వీకరించి ఆనందోత్సవాలతో ఈ వేడుకలను జరుపుకున్నారు.
- మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌కు రాఖీ కట్టిన మాజీ ఎంపీపీ కరుణశ్రీ, పార్టీ మహిళా నాయకురాళ్లు

ధర్మారం, ఆగస్టు 28: పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం లో శుక్రవారం రాఖీ పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. సోదరీమణులు తమ అన్నలు, తమ్ముళ్లకు రాఖీలు కట్టి వారిపై అక్షింతలు వేసి దీవించారు. సోదరులు పెట్టిన కట్న కానుకలను సోదరీమణులు స్వీకరించి ఆనందోత్సవాలతో ఈ వేడుకలను జరుపుకున్నారు. కాగా రక్షాబంధన్ వేడుకల్లో భాగంగా కరీంనగర్ లో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ స్వగృహంలో ఆయనకు ధర్మారం మాజీ ఎంపీపీ ముత్యాల కరుణశ్రీ రాఖీ కట్టారు. స్వీట్లు తినిపించారు. అలాగే నంది ప్యాక్స్ చైర్మన్ ముత్యాల బలరాం రెడ్డికి మాజీ మంత్రి ఈశ్వర్ సతీమణి స్నేహలత కూడా రాఖీ కట్టారు. అనంతరం బీఆర్ఎస్ పార్టీ నాయకురాలు కాంపల్లి అపర్ణ తో పాటు ధర్మపురి నియోజకవర్గంలోని పార్టీ మహిళ నాయకురాళ్లు రాఖీ కట్టి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఈశ్వర్ వారికి కట్న కానుకలు సమర్పించారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
సింగరేణి మండలంలో 500 ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు
మొక్కల వెంకటయ్యకు సత్కారం
Gayatri Devi | ఇంద్రకీలాద్రిపై గాయత్రీదేవి అలంకారంలో దర్శనమిచ్చిన దుర్గాదేవి
Ranabaali | ట్రైలర్‌కి డుమ్మా కొట్టిన రష్మిక .. ప్రీ రిలీజ్ ఈవెంట్లో విజయ్ దేవరకొండతో కలిసి సందడి
Supreme Court: సుప్రీంకోర్టును రాజకీయాల్లోకి లాగొద్దు: సీజేఐ సూర్యకాంత్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

