కమాన్ పూర్: కరీంనగర్ జిల్లా కమాన్ పూర్ మండలం రొంపికుంట గ్రామంలో శనివారం భక్త మార్కండేయ (Bhakta Markandeya) మహర్షి జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. పద్మశాలీ సేవా భవనంలో జరిగిన వేడుకల్లో మార్కండేయ మహర్షి చిత్రపటానికి పూలమాలవేసి పూజలు చేశారు. కార్యక్రమంలో మండల శాఖ అధ్యక్షుడు కుందారపు బాపు, గ్రామశాఖ అధ్యక్షులు కూచన మల్లయ్యమహర్షి పాల్గొని మాట్లాడారు. భక్తిమార్గంలో మోక్షం వస్తుందని మార్కండేయుడు నిరూపించారని వివరించారు. ఈ కార్య క్రమంలో గ్రామ ప్రధాన కార్యదర్శి కుందారపు శంకర్, మల్లయ్య, కొండి మల్లయ్య , అనిల్, రాంబాబు, వేముల శ్రీనువాస్ ఊరగొండ కనుకయ్య, తదితరులు పాల్గొన్నారు.