EGS Gram Sabha | రుద్రంగి, జూలై 16: రుద్రంగి మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో ఈజీఎస్లో భాగంగా జరిగిన అభివృద్ధి పనులపై స్పెషల్ ఆఫీసర్ నటరాజ్, ఉపాధిహామి అధికారుల ఆధ్వర్యంలో బుధవారం గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా నటరాజ్ మాట్లాడుతూ 2024 ఏప్రిల్ నుండి 2025 మార్చి వరకు గ్రామంలో జరిగిన అభివృద్ధి పనులకు సంబంధించి సోషల్ అడిట్ నిర్వహించిన్నట్లు పేర్కొన్నారు.
సోషల్ ఆడిట్లో పనులకు వచ్చిన నగదు చెల్లింపుల వివరాలు గ్రామస్తులకు, ప్రజాప్రతినిధులకు వివరించినట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ చెలుకల తిరుపతి, ఎంపీవో రాజేశ్వర్, టీఏ ధనుంజయ్, కార్యదర్శి రాందాస్, సోషల్ ఆడిట్ అధికారులు, నాయకులు తర్రె మనోహర్, ఎర్రం గంగనర్సయ్య, తూం జలపతి, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.