MLA Vijayaramana Rao | పెద్దపల్లి, ఏప్రిల్19: రైతుల ఆరుగాలం కష్టపడి పండించిన వరి ధాన్యాన్ని గింజ కటింగ్ లేకుంగా కొనుగోలు చేయాలని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహకులకు ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు సూచించారు. జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో హాకా (ది హైదరాబాద్ అగ్రికల్చర్ కో -ఆపరేటివ్ అసోసియేషన్ లిమిటేడ్) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని ఆయన శనివారం ప్రారంభించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. సన్న వడ్లకు ప్రభుత్వం రూ.500 బోనస్ అందిస్తుందని, రైతులు దళారులకు అమ్మకుండా కొనుగోలు కేంద్రాలలో ధాన్యాన్ని విక్రయించాలని సూచించారు. అకాల వర్షాల కారణంగా కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యం తడవకుండా టార్ఫాలిన్ కవర్లు అందుబాటులో ఉంచాలని అధికారులకు చెప్పారు.
ఒక వేళ తడిచిన.. తగు పద్దతలలో ఆరబెట్టించి కొనుగోలు చేయాలన్నారు. ఎక్కడ రైతులు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ ఈర్ల స్వరూప, వైస్ చైర్మన్ మల్లారెడ్డి, గోపగాని సారయ్య గౌడ్, మాదిరెడ్డి నర్సింహారెడ్డి, సందనవేన రాజేందర్, నూగిళ్ల మల్లయ్య, బీ సంపత్, ఉప్పు రాజు, రామ్మూర్తి, ఎం సాంబీరెడ్డి, మస్రత్, సంపత్, పూదరి మహేందర్, రమేష్, గుజ్జుల కుమార్, కే రవి కుమార్, ఇన్చార్జి కార్యదర్శి మనోహర్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.