without cutting | కాల్వ శ్రీరాంపూర్ ఏప్రిల్ 13 : ఎలాంటి కటింగ్ లు లేకుండా ధాన్యం కొనుగోలు చేస్తామని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు. కాల్వశ్రీరాంపూర్, పెగడపల్లి, మడిపల్లి, మడిపల్లి కాలనీ, ఆశన్నపల్లె, అంకంపల్లి గ్రామాల్లో సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే విజయరమణారావు ఆదివారం ప్రారంభించారు. తూకంలో ఎలాంటి కటింగ్ లు చేసినా సహించేది లేదని అధికారులను హెచ్చరించారు. తూకం అయిన వెంటనే రైతులకు రశీదులు ఇవ్వాలని ఆదేశించారు. కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ చదువు రాంచంద్రారెడ్డి, ఏఎంసీ చైర్మన్ రామిడి తిరుపతిరెడ్డి, మాజీ ఎంపీపీ గోపగాని సారయ్య గౌడ్, సీఈవో కోలేటి శ్రీనివాస్, మాజీ సర్పంచులు అరెల్లి సుజాత రమేశ్, గాజనవేన సదయ్య, ఆకుల చిరంజీవి, పీఏసీఎస్, ఏఎంసీ డైరెక్టర్లు, ఆయా శాఖల అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
మాజీ స్పీకర్ వర్ధంతి
మాజీ స్పీకర్, దివంగత మంథని మాజీ ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీపాదరావు వర్ధంతిని కాల్వశ్రీరాంపూర్ లో నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీపాదరావు చిత్రపటానికి ఎమ్మెల్యే విజయరమణారావు పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఆయన చేసిన సేవలను కొనియాడారు.