చొప్పదండి, మార్చి 7: తెలంగాణ ప్రభుత్వం మహిళల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నదని ఎంపీపీ చిలుక రవీందర్ పేర్కొన్నారు. మండలంలోని కొలిమికుంటలో సర్పంచ్ తాళ్లపల్లి సుజాత-శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో కేసీఆర్ మహిళా బంధు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ రజిత, ఎంపీడీవో స్వరూపారాణి, సర్పంచ్ తాళ్లపల్లి సుజాత, మహిళా అధికారులు, అంగన్వాడీ టీచర్లు, మహిళా సంఘం సభ్యులను సన్మానించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీపీ మాట్లాడుతూ, మహిళల సంక్షేమానికి సీఎం కేసీఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నారని కొనియాడారు. అనంతరం కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ సత్తు తిరుపతి, సింగిల్‌విండో కార్యదర్శి తిరుపతిరెడ్డి, నాయకులు నెరుమట్ల మల్లేశం,ఆకుల సురేశ్, సత్తు తిరుపతి, రాజయ్య, అశోక్, మోహన్ తదితరులు పాల్గొన్నారు.
రామడుగు, మార్చి 7: గోపాల్రావుపేట పీహెచ్సీలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గంట్ల జితేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో మహిళా వైద్యాధికారులు, ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలు, అంగన్వాడీ టీచర్లు, పారిశుధ్య కార్మికులు, ఎంపీటీసీ ఎడవెల్లి కరుణశ్రీ, వార్డు సభ్యులను సన్మానించారు. అలాగే, అన్ని గ్రామాల్లో మహిళా సిబ్బందికి, ప్రజాప్రతినిధులకు గ్రామ పంచాయతీ పాలకవర్గం, యువజన సంఘాల ఆధ్వర్యంలో సన్మానం చేశారు. కార్యక్రమాల్లో మాజీ ఎంపీపీ మార్కొండ కిష్టారెడ్డి, ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు ఎడవెల్లి నరేందర్‌రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ గంట్ల వెంకటరెడ్డి, ఎంపీటీసీ కరుణశ్రీ, కొండగట్టు దేవస్థానం బోర్డు డైరెక్టర్ దాసరి రాజేందర్‌రెడ్డి, ఆర్బీఎస్ జిల్లా సభ్యుడు గర్రెపెల్లి కరుణాకర్, ఏఎంసీ డైరెక్టర్లు పైండ్ల శ్రీనివాస్, మచ్చ గంగయ్య, మండల కో-ఆప్షన్ సభ్యుడు రజబ్అలీ, వైద్యాధికారులు రాజేందర్, శిరీష, నాయకులు ఎన్ అంజయ్య, పూడూరి మల్లేశం, కర్ర శ్యాంసుందర్‌రెడ్డి, సుద్దాల మల్లేశం, ఎడవెల్లి పాపిరెడ్డి, కొలిపాక కమలాకర్, వేల్పుల హరికృష్ణ, రఘు, వీర్ల రవీందర్రావు, జడ్పీ కో-ఆప్షన్ సభ్యుడు శుక్రొద్దీన్, నాగుల రాజశేఖర్‌గౌడ్, ఎడవెల్లి సత్యనారాయణరెడ్డి, ఎంపీటీసీ అనిల్‌కుమార్, శనిగరపు అర్జున్, అనిల్, దొడ్డ లచ్చిరెడ్డి, సర్పంచ్ బక్కశెట్టి నర్సయ్య, ఎంపీటీసీ మోడి రవీందర్, చాడ శేఖర్‌రెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, ఎడవెల్లి మల్లేశం, ఎంపీటీసీ మహేందర్‌రెడ్డి, ఎల్కపల్లి లచ్చయ్య, పెగుడ శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
గంగాధర, మార్చి 7: మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని జడ్పీటీసీ పుల్కం అనురాధ పిలుపునిచ్చారు. కేసీఆర్ మహిళా బంధు కార్యక్రమంలో భాగంగా కురిక్యాలలో సర్పంచ్ మేచినేని నవీన్‌రావు ఆధ్వర్యంలో సోమవారం ఆశ కార్యకర్తలు, అంగన్వాడీ టీచర్లు, పారిశుధ్య సిబ్బంది, మహిళా సంఘం సభ్యులకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా హాజరైన జడ్పీటీసీ వారిని శాలువాలతో సన్మానించి, మాట్లాడారు. గంగాధరలో సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు మడ్లపెల్లి గంగాధర్ ఆధ్వర్యంలో ఆరోగ్య, అంగన్వాడీ, పారిశుధ్య సిబ్బంది, మహిళా వార్డు సభ్యులను సన్మానించారు. మార్కెట్ కమిటీ చైర్మన్ సాగి మహిపాల్‌రావు ఆధ్వర్యంలో ఎస్టీవో మంజులతను సర్పంచులు సన్మానించారు. కార్యక్రమంలో సర్పంచులు వేముల దామోదర్, జోగు లక్ష్మీరాజం, నాయకులు రేండ్ల శ్రీనివాస్, రామిడి సురేందర్, మడ్లపెల్లి శ్రీనివాస్, దొడ్ల ఎల్లారెడ్డి, గాలిపెల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
కరీంనగర్ రూరల్, మార్చి 7: కరీంనగర్ రూరల్ మండలం చెర్లభూత్కూర్ గ్రామంలో కల్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్, షాదీముబారక్ లబ్ధిదారులతో ప్రజాప్రతినిధులు సెల్ఫీలు దిగారు. టీఆర్ఎస్ గ్రామాధ్యక్షుడు కూర శ్యాంసుందర్ రెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు, కరీంనగర్ సింగిల్ విండో చైర్మన్ పెండ్యాల శ్యాంసుందర్ రెడ్డి, సర్పంచ్ దబ్బెట రమణారెడ్డి, ఎంపీటీసీ బుర్ర తిరుపతి, టీఆర్ఎస్ నాయకులు కూర నరేశ్‌రెడ్డి, నల్ల శ్రీనివాస్ రెడ్డి, రాజమల్లు, చిల్కూరి సతీశ్, కూర రంగారెడ్డి, చింత లక్ష్మణ్ పాల్గొన్నారు. చామనపల్లి ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలు స్వర్ణలత ఆధ్వర్యంలో విద్యార్థుల తల్లులకు ఆటల పోటీలు నిర్వహించి, బహుమతులు అందజేశారు. బిగ్ హార్ట్ ఫౌండేషన్ సభ్యురాలు జమున రూ. 2 లక్షల విలువైన నీటి శుద్ధి యంత్రం, పిల్లలకు ఆట వస్తువులు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి జనార్దన్‌రావు, ఎంపీపీ తిప్పర్తి లక్ష్మయ్య, సర్పంచ్ బోగొండ లక్ష్మి-ఐలయ్య, ఎస్ఎంసీ చైర్మన్ బూర్ల శ్రీనివాస్, ఉపసర్పంచ్ దావు నిర్మల, వార్డు సభ్యులు పాల్గొన్నారు. జూబ్లీనగర్‌లో సర్పంచ్ రుద్ర భారతీ ఆధ్వర్యంలో ఏఎన్ఎం, ఆశ కార్యకర్తలు, అంగన్వాడీ టీచర్లు, పారిశుధ్య కార్మికులను సన్మానించారు. మాజీ సర్పంచ్ రుద్ర రాములు, ఎంపీటీసీ చల్ల రామక్క, నాయకులు లింగారెడ్డి, మునిరెడ్డి, కుమార్ పాల్గొన్నారు.