MLA Sanjay Kumar | రాయికల్ : అన్ని వర్గాల ప్రజలకు ప్రభుత్వం అండగా ఉంటుందని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ అన్నారు. రాయికల్ పట్టణంలోని రేణుకా ఎల్లమ్మ ఆలయం వద్ద జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో రాయికల్, మహితాపూర్ కి చెందిన 80 మంది కల్లుగీత కార్మికులకు 100శాతం సబ్సిడీతో కాటమయ్య రక్షణ కిట్లు మంజూరు కాగా ఎమ్మెల్యే శుక్రవారం పంపిణీ చేశారు. అంతకుముందు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. అనంతరం రాయికల్ పట్టణ పద్మశాలీ సంఘంలో రాయికల్ మండలానికి చెందిన 27 మంది లబ్ధిదారులకు సీఎం సహాయనిధి ద్వారా మంజూరైన రూ.9లక్షలు, షాదీ ముభారక్ ద్వారా మంజూరైన రూ.4 లక్షల విలువగల 4 చెక్కులను లబ్ధిదారులకు ఎమ్మెల్యే పంపిణీ చేశారు. అలాగే రాయికల్ పట్టణంలో రూ.12.50 లక్షలతో చేపట్టిన పటేల్ రోడ్ నుండి వీరాపూర్ రోడ్డు వరకు వాటర్ సప్లై పైప్ లైన్ పనులు, రూ.20 లక్షలతో డివైడర్ అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు.
ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ అధికారి సునీత, ఎక్సైజ్ సీఐ సర్వేశ్వర్,పాక్స్ చైర్మన్ లు ఏనుగు మల్లారెడ్డి, రాజిరెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ మోర హనుమండ్లు, మాజీ వైస్ చైర్మన్ గండ్ర రమాదేవి అచ్యుత రావు, ఎనగందుల శ్రీనివాస్, విఠల్, కోల శ్రీనివాస్, రవీందర్ రావు, గంగారెడ్డి, పడిగేల రవీందర్ రెడ్డి, నారాయణ గౌడ్, శ్రీనివాస్ గౌడ్, తిరుపతి గౌడ్, అనుపురం శ్రీనివాస్ గౌడ్, రాజేశంగౌడ్, అధికారులు, గౌడ సంఘం నాయకులు, పట్టణ నాయకులు తదితరులు పాల్గొన్నారు.