Jagityal | జగిత్యాల, జూలై 3 : ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులలో నైపుణ్యాభివృద్ధి ఉపాధి అవకాశాలను పెంపొందించేందుకు టాటా కమ్యూనిటీ ఇనిషియేటివ్స్ ట్రస్ట్ వారి టాటా స్ట్రైవ్ స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్ తో అవగాహన ఒప్పందం కుదుర్చుకుందని కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ రామకృష్ణ వెల్లడించారు.
ఈ ఏంవోయూ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కే రామకృష్ణ, టీఎస్ కేసీకో- ఆర్డినేటర్ నీరజ, మెంటార్, తిరుపతి, డాక్టర్ ప్రమోద్ కుమార్, చంద్రయ్య, రహీం వరప్రసాద్, వాసవి, రామచంద్రం, శ్రీలత, సంగీత, సుజాత, మల్లికార్జున, జమున, టాటా స్ట్రైవ్ స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్ ప్రతినిధి కట్కం రాజ శేఖర్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
అయితే ఈ ఎంవోయూ ఒప్పందం ప్రకారం కళాశాల గ్రాడ్యుయేట్స్ కు టాటా స్ట్రైవ్ స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్ ద్వారా బ్యాంకింగ్ ఫైనాన్సియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ సెక్టార్ లో బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటీవ్ (బీడీఈ)గా పని చేయుటకు కావాల్సిన శిక్షణ, ఇంటర్న్షిప్లు, కెరీర్ ప్లేస్ మెంట్ మార్గదర్శకత్వం అందించబడతాయని, 42 రోజుల పాటు సాగే ఈ శిక్షణకు గాను విద్యార్థులకు ఉచిత భోజన, హాస్టల్ వసతి కల్పిస్తామన్నారు. ట్రైనింగ్ అనంతరం సర్టిఫికెట్ ప్రదానం చేయబడుతుందని ప్రిన్సిపాల్ వెల్లడించారు.