Gourd celebrations | కోరుట్ల, జూలై 5: పట్టణంలోని పిఆర్బిఎం జూనియర్ కళాశాలలో ఆషాడ మాసాన్ని పురస్కరించుకొని శనివారం గోరింటాకు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థినిలు, ఉపాధ్యాయురాళ్లు అరచేతులకు గోరింటాకు పెట్టుకుని సందడి చేశారు.
ప్రకృతి సిద్ధంగా లభించే గోరింటాకు ఈ మాసంలో వాడితే శరీరంలో వేడిని తొలగించడమే కాకుండా కొన్ని రకాల ఇన్ఫెక్షన్లను దూరం చేస్తుందని ఉపాధ్యాయులు గోరింటాకు విశిష్టతను విద్యార్థులకు వివరించారు. కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్, ప్రిన్సిపల్, ఉపాధ్యాయురాళ్లు పాల్గొన్నారు.