చిగురుమామిడి, మార్చి 13 : మండలంలోని నవాబుపేట ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో(Nawabpet school) మందుబాబులు హల్చల్ చేస్తున్నారు. రాత్రి అయితే చాలు పాఠశాల ఆవరణ గోడ పై నుంచి దూకి మద్యం(Drinking alcohol) విచ్చలవిడిగా సేవిస్తున్నారు. స్కూల్ ఆవరణలోనే మద్యం సీసాలను పడవేస్తున్నారు. దీంతీ విద్యార్థులు నడిచేందుకు ఇబ్బందికరంగా మారింది.
పాఠశాల బాత్రూం డోర్, నల్లాలను పాడు చేస్తున్నారు. పలుమార్లు బాగు చేసినప్పటికీ తాగుబోతుల ఆగడాలతో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రభుత్వ పాఠశాలను కాపాడుకోవాలని, మందు బాబుల ఆగడాలను అరికట్టేందుకు సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకుడు ఏడెల్లి సంపత్ ప్రభుత్వాన్ని కోరారు.