స్వరాష్ట్రంలో సుపరిపాలన
ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతం వెనుకబడిందని, స్వరాష్ట్రంలోనే ప్రజలకు సుపరిపాలన అందుతున్నదని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు.
- కేసీఆర్ నాయకత్వంలో ప్రజల వద్దకే ప్రభుత్వం
- నిధులు, విధులతో అద్భుతంగా గ్రామాలు
- ప్రగతి పథంలో పల్లెలు
- మంత్రి గంగుల కమలాకర్
- కొత్తపల్లి మండల పరిషత్‌లో సుపరిపాలన దినోత్సవం
కొత్తపల్లి, జూన్ 10 : ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతం వెనుకబడిందని, స్వరాష్ట్రంలోనే ప్రజలకు సుపరిపాలన అందుతున్నదని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శనివారం కరీంనగర్ నియోజకవర్గంలోని కొత్తపల్లి మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ పిల్లి శ్రీలత మహేశ్ అధ్యక్షతన నిర్వహించిన సుపరిపాలన దినోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజర్యారు. ఈ సందర్భంగా కొత్తపల్లిలో జరిగిన అభివృద్ధిపై సుదీర్ఘంగా చర్చించారు. కొత్తపల్లి మండలం కాక ముందు ఎలా ఉండేది?, మండలం ఏర్పడిన తర్వాత ఎలా ఉంది? అని అడిగి తెలుసుకున్నారు. వైకుంఠ ధామాలు, హరితహారం, ఇతర అభివృద్ధి పనులపై కూలంకశంగా చర్చించారు.
స్వయం పాలనలో తీసుకున్న చర్యలతో కొత్తపల్లి మండలం ఇప్పటి వరకు రెండు సార్లు ఉత్తమ మండలంగా అవార్డులు అందుకుందని అధికారులు మంత్రికి తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ నాయకత్వంలో ప్రజల వద్దకే ప్రభుత్వ పాలన చేరుకున్నదని తెలిపారు. గ్రామ పంచాయతీలకు సమృద్ధిగా నిధులు, విధులు ఇవ్వడంతో అభివృద్ధి అద్భుతంగా కొనసాగుతుందన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా పల్లెలు ప్రగతి పథంలో నడుస్తున్నాయని చెప్పారు. గ్రామాల్లో సకల సౌకర్యాలు ఏర్పాటయ్యాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ పిట్టల కరుణ రవీందర్, జడ్పీ కోఆప్షన్ సభ్యుడు సాబీర్ పాషా, వ్యవసాయ మారెట్ కమిటీ చైర్మన్ రెడ్డవేణి మధు, మాజీ జడ్పీ కో ఆప్షన్ సభ్యుడు జమీలుద్దీన్, ఎంపీడీవో శ్రీనివాస్‌రెడ్డి, తహసీల్దార్ వెంకట్‌రెడ్డి, ఎంపీటీసీలు, సర్పంచులు, అధికారులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

