CITU | సారంగాపూర్, అక్టోబర్ 11: గ్రామ పంచాయతీ కార్మికులకు ఉరితాడులా ఉన్న జీవో నంబర్ 51ని సవరించాలని, మల్టీ పర్సస్ వర్కర్ విధానం రద్దు చేయాలని తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్, వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి, మండల గౌరవ అధ్యక్షుడు పులి మల్లేశం పేర్కోన్నారు. సీఐటీయూ రాష్ట్ర కమిటి పిలుపు మేరకు బీర్ పూర్ మండలంలోని తుంగూర్ గ్రామంలో మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శుల ఆధ్వర్యంలో రాష్ట్ర మహాసభల పోస్టర్ను శనివారం ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ కార్మికులకు మెడకు ఉరితాడులా ఉన్న జీవో నంబర్ 51ని సవరించాలని, ఆన్లైన్లో పేర్లు లేని వారివి పేర్లు నమోదు చేయాలని, సీఎం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని పేర్కోన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో గ్రామ పంచాయతీ సిబ్బందికి గ్రీన్ చానల్ ద్వారా ప్రతీ నెల 1న సిబ్బందికి వేతనాలు చెల్లిస్తామని ఇచ్చిన హమీలను అమలు చేయాలని, వేతనాలకు బడ్జెట్ కెటాయించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, పర్మినెంట్ చేయాలని, ఈఎస్ఐ, ఫీఎఫ్, ఇన్సూరెన్స్ భీమా అమలు చేయాలని, అర్హత అనుభవం ఉన్నవారికి ప్రమోషన్లు ఇవ్వాలని పలు డిమాండ్లను పరిష్కరించాలని పేర్కొన్నారు.
ఈ నెల14న గొల్లపల్లి మండల కేంద్రంలో జరిగే గ్రామ పంచాయతీ కార్మికుల జిల్లా 5వ మహాసభను, ఈనెల 24, 25న మహబూబాబాద్ జిల్లా గార్ల మండలంలో జరిగే ఐదో రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని కోరారు. ఆయా సభలకు కార్మికులు అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని పేర్కొన్నారు. రాష్ట్ర మహాసభల్లో భవిషత్ కార్యచరణపై నిర్ణయం తీసోకో నున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కార్మిక సంఘం మండల అధ్యక్షులు బేతి లచ్చన్న, కనుక వికాష్, పూడూరి నర్సయ్య, బొమ్మనా గంగన్న తదితరులు పాల్గొన్నారు.