Singareni | Singareni | గోదావరిఖని : 60 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన జీడీకే 1 గనిలో మొదటి సారిగా బోనాల పండుగను ఘనంగా నిర్వహించడానికి సంస్థ ఆర్జీ-1 జనరల్ మేనేజర్ లలిత్ కుమార్ నిర్ణయించారు. డిసెంబర్ 19న దుర్గామాత గుడి వార్షికోత్సవం సందర్భంగా గని పై ఘనంగా బోనాల పండుగ నిర్వహించడానికి నిర్ణయించి జీఎం అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
ఈ సందర్భంగా సింగరేణి ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల నాయకులు లింగమూర్తి, రామచందర్, జనగామ స్వప్న, రామగిరి అంకుల్ తదితరులు హర్షం వ్యక్తం చేస్తూ జీఎం లలిత్ కుమార్, ఎస్వోటూ జీఎం చంద్రశేఖర్‌ను సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు. రామగుండం రీజియన్ లో మొదటి బొగ్గు గనిగా ఉన్న జీడీకే 1 గనిలో మొదటిసారిగా బోనాల పండుగను అధికారికంగా సింగరేణి యాజమాన్యం నిర్వహించడం సంతోషంగా ఉందని వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా జీఎంకు వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.