కమాన్‌చౌరస్తా, జనవరి 1: భగత్‌నగర్ హరిహర క్షేత్రంలోని వేంకటేశ్వర స్వామి వారికి రావికంటి హరిప్రసాద్, ప్రమోదకుమారి దంపతులు ఇత్తడి గరుడ వాహనం అందజేసినట్లు ఆలయ ఈవో కొస్న కాంతారెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా వాహనాన్ని ఆలయ అర్చకుల సమక్షంలో అందజేసి పూజలు నిర్వహించారు. ఇక్కడ అర్చకులు శ్రీనివాస శర్మ, కృష్ణకుమార్ గురుస్వామి తదితరులు పాల్గొన్నారు.
అలాగే, హరిహర క్షేత్రం అయ్యప్ప ఆలయంలో స్వామి వారికి అర్చకులు మంగళంపల్లి రాజేశ్వరశర్మ, డింగరి చాణక్య ఆధ్వర్యంలో మహాలింగార్చన చేశారు. సోమవారం ముకోటి ఏకాదశిని పురస్కరించుకొని ఉత్తర ద్వార దర్శనం కోసం ఏర్పాట్లు చేసినట్లు ఈవో వివరించారు.