Police | తిమ్మాపూర్, ఆగస్టు23: మండలంలోని గణేష్ ఉత్సవ కమిటీ శాంతి సమావేశాన్ని ఎల్ఎండీ పోలీస్టేషన్ ఆవరణలో ఎస్ఐఐ శ్రీకాంత్ గౌడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. సీఐ సదన్ కుమార్, ట్రాన్స్కో ఏఈ మాటూరి వీరాచారి, ఎంపీడీవో సురేందర్ తో కలిసి సమావేశం ఏర్పాటు చేశారు. ఆయా శాఖల అధికారులు నిర్వహకులకు పలు సూచనలు చేశారు.
సంప్రదాయబద్ధంగా ఉత్సవాలు నిర్వహిస్తే బహుమతులు అందజేస్తామన్నారు. మొదటి బహుమతి రూ.5016, రెండవ రూ.3016, మూడో రూ.2016 నగదును నిర్వహకులకు అందజేస్తామన్నారు. ప్రతీ మండపం వద్ద జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. విద్యుత్, పారిశుద్ధ్యం పర్యవేక్షణ ఉండాలన్నారు. జాగ్రత్తగా ఉండాలన్నారు. కార్యక్రమంలో ఎస్ఐ సయ్యద్ అన్వర్, ఉత్సవ కమిటీ నిర్వహకులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.