Gambusia fish | కోల్ సిటీ, ఆగస్టు 30: రామగుండం నగర పాలక సంస్థ కమిషనర్ జే.అరుణ శ్రీ ఆదేశాల మేరకు శనివారం దోమల లార్వా తినే గంబూషియా చేప పిల్లలను మున్సిపల్ సిబ్బంది మురుగు నీటి కుంటల్లో వదిలారు. మత్స్యశాఖ సహకారంతో మొదటి దఫాలో 5 వేల గంబూషియా చేప పిల్లలను కరీంనగర్ నుంచి తెప్పించి నగరంలోని పలు మురికి వాడలను గుర్తించి కుంటలు, నీరు ఎక్కువగా నిలిచి ఉండే ప్రాంతాల్లో ఈ చేప పిల్లలను వదిలినట్లు కమిషనర్ తెలిపారు.
లార్వా అంతరించిపోతే దోమలు సంతతి పెరగడానికి అవకాశం ఉండదన్నారు. దోమల నిర్మూలనకు ఫాగింగ్, ఆయిల్ బాల్స్ వేయడం, స్ప్రేయింగ్ కార్యక్రమాలు నిరాటంకంగా కొనసాగుతున్నాయని అన్నారు. స్వచ్ఛ భారత్ మిషన్లో భాగంగా క్లీన్ లీ నెస్ టార్గెట్ యూనిట్స్ కూడా గుర్తించినట్లు తెలిపారు.