Free training | కమాన్చౌరస్తా, ఆగస్టు 2 : కరీంనగర్ జిల్లా కేంద్రంలోని యజ్ఞవరాహ స్వామి ఆలయంలో భగవంతునికి ఆలంకరించే పూలమాలల అల్లికలో మెళకువలపై ప్రత్యేక శిక్షణ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ నుంచి హాజరైన ట్రైనర్లు ఉష, నత్నమాల, విజయ్, సుధీర్లు పెద్ద సంఖ్యలో హాజరైన మహిళలకు మెళకువలు నేర్పించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రతి సందర్భంగా ఆలయాల్లో, పూజల్లో దేవతా మూర్తులకు సమర్పించే పుష్పాల అల్లికలో మెళకువలు పాటిస్తే పూలకు ప్రత్యేక అందం వస్తుందన్నారు. ఈ పూలను అల్లడం ఎంతో నైపుణ్యంతో కూడుకున్నదని, రకరకాల పూలను ఒక పద్దతిలో పొందికగా కూర్చి మాలకట్టడం ఒక కళ అని చెప్పారు. ఈ కార్యక్రమంలో సర్వవైదిక సంస్థానం ట్రస్ట్రీ శ్రీభాష్యం వరప్రసాద్, నిర్వాహకులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.