Training camp | కోల్ సిటీ, జూన్ 3: మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ఉచిత కుట్టు శిక్షణ కేంద్రం ఏర్పాటు చేసినట్లు రాణి రుద్రమ దేవి కుట్టు శిక్షణ కేంద్ర నిర్వాహకులు కటుకు ప్రవీణ్ తెలిపారు. రామగుండం స్థానిక 13వ డివిజన్ లో రాణి రుద్రమదేవి ఉచిత నైపుణ్య శిక్షణ కేంద్రంలో 45 రోజుల ఉచిత కుట్టు శిక్షణ శిబిరం ఏర్పాటు చేశారు.
ఉచిత కుట్టు శిక్షణ శిబిరం ముగింపు కార్యక్రమాన్ని కేంద్రంలో మంగళవారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని, మహిళాభివృద్ధికి ఆర్థికత చేకూరితే మరింత ముందుకెళ్లే అవకాశం ఉందని, ఇందుకు నా వంతు సహాయంగా ఉచిత శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేసి సుమారు 60 మంది మహిళలకు ఉచితంగా కుట్టు శిక్షణాలో ఇప్పించినట్లు తెలిపారు.
ఈ శిక్షణలో మేము ఎంతగానో నేర్చుకొని మా వంతు సహాయంగా మేము ఆర్థికంగా ముందుకెళ్తామని మహిళా మణులు సంతోషం వ్యక్తం చేశారు. అదేవిధంగా ఉచిత అబాకాస్ క్లాసులను కూడా స్టార్ట్ చేశామని, అబాకాస్ క్లాసుల ద్వారా పిల్లల భవిష్యత్తు ఉజ్వలంగా మారుతుందని భావిస్తూ కటుకు ప్రవీణ్ ఇంత మంచి కార్యక్రమాలకు పూనుకున్నారని పిల్లల తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో భరోసా స్వచ్ఛంద సంస్థ ఫౌండేషన్ అధినేత నసీమా బేగం, శిక్షకురాలు రేష్మ, అధిక సంఖ్యలో బస్తీవాసులు, మహిళలు పాల్గొన్నారు.