Free service | గంగాధర, సెప్టెంబర్ 15 : గంగాధర మండలం మధురనగర్ గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న ప్రభుత్వ పాఠశాల, ప్రభుత్వం ప్రాథమిక ఆరోగ్యం కేంద్రం, దేవాలయానికి అవసరమైన మరమ్మత్తుల ను ఏడాది పాటు ఉచితంగా చేస్తామని మధురానగర్ తాపీ అండ్ సెంట్రింగ్ వర్కర్స్ కార్మిక సంఘం అధ్యక్షుడు గుంజి మల్లిఖార్జున రావు అన్నారు. ఇందుకు గాను సంఘం నుండి ఒక మేస్త్రిని, లేబర్ ను మరమత్తు పనులకు కేటాయిస్తామని తెలిపారు.
తాపీ అండ్ సెంట్రింగ్ వర్కర్స్ కార్మిక సంఘం నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక సర్పంచ్ వేముల భాస్కర్ నూతన కార్యవర్గన్ని సన్మానించి అభినందించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ తూము రాజ్ కుమార్, నాయకులు పెంచాల చందు, పెరుక గవాస్కర్, తూము తిరుపతి, తూము కరుణాకర్, పెరుక మహేష్, సంఘం కార్యవర్గం సభ్యులు పాల్గొన్నారు.