Dr. Chirumilla Rakesh | పెద్దపల్లి రూరల్, జూలై 21 : పెద్దపల్లి ఏసీపీ గజ్జి కృష్ణ యాదవ్ తండ్రి గజ్జి ఐలయ్య గత నాలుగు రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో మరణించిగా జైపూర్ ( రసూల్ పల్లి) లో వారి ఇంటికి వెళ్లి ఏసీపీ గజ్జి కృష్ణయాదవ్ ను టీఎస్ టీఎస్ మాజీ చైర్మన్ డాక్టర్ చిరుమిల్ల రాకేష్ సోమవారం పరామర్శించారు.
ఈ సందర్భంగా గజ్జి కష్ణయాదవ్ తండ్రి మల్లయ్య చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఏసీపీని పరామర్శించి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన వెంట సీనియర్ కాంగ్రెస్ నాయకులు మాజీ సర్పంచ్ ఎడెల్లి శంకర్, ప్రముఖ సీనియర్ న్యాయవాది ఉప్పు రాజన్న పటేల్, బీఆర్ఎస్ నాయకులు మేడుదుల రాజ్ కుమార్ యాదవ్, ఉప్పు శివకుమాల్ పటేల్, కూకట్ల నవీన్ యాదవ్, సలీమ్, విద్యాసాగర్ తదితరులు ఉన్నారు.