KoppulaEshwar | ధర్మారం, జూన్ 11: రాష్ట్ర మాజీ మంత్రి, ధర్మపురి మాజీ ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్ జీవితం అందరికీ ఆదర్శప్రాయమని బీఆర్ఎస్ నాయకులు పేర్కొన్నారు. ఈశ్వర్ జీవిత చరిత్ర గురించి ప్రభుత్వ ఉపాధ్యాయుడు నూతి మల్లన్న రచించిన ‘ఒక ప్రస్థానం’ పుస్తకాన్ని పార్టీ నాయకులు పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో మాజీ సర్పంచ్ పూస్కురు జితేందర్ రావు స్వగృహంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పార్టీ మండల అధ్యక్షుడు రాచూరి శ్రీధర్ మాట్లాడుతూ పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం కుమ్మరికుంటలో మల్లమ్మ లింగయ్య దంపతులకు 1959 ఏప్రిల్ 20వ తేదీన ఈశ్వర్ జన్మించాడని అన్నారు.
వృత్తిరీత్యా ఈశ్వర్ సింగరేణి సంస్థలో కోల్ కట్టర్ గా ఉద్యోగ ప్రస్థానాన్ని మొదలుపెట్టాడని ఆయన పేర్కొన్నారు. అభ్యుదయ భావాలున్న ఈశ్వర్ సింగరేణి కార్మికుల హక్కుల కోసం పోరాటం చేసిన ఘన చరిత్ర ఆయనది అని అన్నారు. ఆయనకు ఎన్నో సంఘటనలు ఎదుర్కొని ధైర్యంగా నిలబడ్డారని శ్రీధర్ పేర్కొన్నారు. గోదావరి బొగ్గు గని కార్మిక సంఘ నాయకుడిగా ఈశ్వర్ కు గొప్ప ప్రఖ్యాతి వచ్చిందని ఆయన అన్నారు. ఈశ్వర్ పై ఎన్నో అక్రమ కేసులు నమోదైనప్పటికీ వాటిని ధైర్యంగా ఎదుర్కొని నిలబడ్డారని ఆయన పేర్కొన్నారు. అనంతరం ఈశ్వర్ 1984లో మొట్టమొదట టీడీపీలో చేరి తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించాడని ఈశ్వర్ వివరించారు. అనంతరం 1994లో ఆ పార్టీ నుంచి మేడారం అసెంబ్లీ నియోజకవర్గంలో తొలిసారి ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి అవకాశం రాగా ఆ సమయంలో ఈశ్వర్ ఓటమిపాలైనప్పటికీ రాజకీయంగా నిలదొక్కుకొని ప్రజల మధ్యనే ఉన్నాడని శ్రీధర్ వివరించారు.
అనంతరం ఈశ్వర్ తెలంగాణ రాష్ట్ర సమితి ( టిఆర్ఎస్) ఆవిర్భావ సమయంలో 2001లో కేసీఆర్ నేతృత్వంలో ఆ పార్టీలో చేరి తిరుగులేని రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారని ఆయన వివరించారు. 2004లో మేడారం అసెంబ్లీ నియోజకవర్గంలో టిఆర్ఎస్ తరఫున పోటీ చేసి ఈశ్వర్ ఎమ్మెల్యేగా ఘన విజయం సాధించాడని ఆయన గురించి. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర సాధన కోసం రాజీనామా చేయాలని కెసిఆర్ ఇచ్చిన పిలుపుమేరకు ఈశ్వర్ రాజీనామా చేసి 2008లో అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజల మద్దతుతో విజయం సాధించారని ఆయన గుర్తు చేశారు. అనంతరం ధర్మపురి నియోజకవర్గ ఏర్పడగా 2009లో సాధారణ, 2010లో ఉప ఎన్నిక,2014,2018 సాధారణ అసెంబ్లీ ఎన్నికల్లో ఈశ్వర్ పోటీ చేసి తిరుగులేని విజయాన్ని సాధించి ప్రభుత్వ విప్, రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రిగా పదవులు నిర్వహించి ప్రజల్లో ప్రత్యేక గుర్తింపును సాధించి ఆయన ఎంతో ఆదర్శంగా నిలిచాడని శ్రీధర్ కొనియాడారు.6 సార్లు వరుసగా ఎమ్మెల్యేగా గెలిచిన ఘనత ఈశ్వర్ డి అని ఆయన కొనియాడారు. రాష్ట్ర సాధన కోసం రెండుసార్లు తన పదవిని తృణప్రాయంగా రాజీనామా చేసి 2008,2010 ఎమ్మెల్యేగా విజయం సాధించిన ఘనత ఈశ్వర్ ది అని ఆయన వివరించారు.
ఈ కార్యక్రమంలో నంది మేడారం ప్యాక్స్ చైర్మన్ ముత్యాల బలరాం రెడ్డి, పార్టీ సీనియర్ నేత పూస్కూరు జితేందర్ రావు, ఏఎంసీ మాజీ చైర్మన్లు కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి, గుర్రం మోహన్ రెడ్డి, మాజీ వైస్ చైర్మన్ కోమటిరెడ్డి మల్లారెడ్డి, మండల మాజీ కోఆప్షన్ సభ్యుడు ఎండి రఫీ ,ఆర్ బి ఎస్ జిల్లా మాజీ సభ్యులు పూస్కురు రామారావు,ఎగ్గేల స్వామి ఆర్.బి.ఐ.ఎస్ మాజీ మండల అధ్యక్షుడు పాకాల రాజయ్య, పార్టీ మాజీ మండలాధ్యక్షుడు పెంచాల రాజేశం, మాజీ ఎంపీటీసీ సభ్యులు కాంపెల్లి చంద్రశేఖర్, మిట్ట తిరుపతి, దాడి సదయ్య, మోతే సుజాత కనకయ్య, మాజీ సర్పంచ్ కారుపాకల రాజయ్య, ధర్మారం మాజీ ఉపసర్పంచ్ ఆవుల లత , పార్టీ మండల ప్రధాన కార్యదర్శి కూరపాటి శ్రీనివాస్, ఉపాధ్యక్షులు నాడెం శ్రీనివాస్, గాజుల రాజు, పార్టీ అనుబంధ మండలాధ్యక్షులు దేవి నలినీకాంత్ మంద శ్రీనివాస్ గుజ్జేటి కనకలక్ష్మి ,పార్టీ నాయకులు సాన రాజేందర్, ఆవుల శ్రీనివాస్, ఆవుల వేణు, అజ్మీర శ్రీనివాస్ నాయక్, దేవి రాజారాం, ఎండి అజాం బాబా, సంధినేని కొమురయ్య, కల్లేపల్లి లింగయ్య, మహిళా నాయకురాళ్లు కాంపల్లి అపర్ణ, మర్రి మమత, మార్క సంధ్య, దేవి రేణుక తదితరులు పాల్గొన్నారు.