Velala Mallanna temple | సారంగాపూర్, ఆగస్టు 10: జైపూర్ మండలంలోని ఫానూర్ గ్రామంలోని వేలాల మల్లన్న ఆలయ అభివృద్ధికి సారంగాపూర్ మండల తాజామాజీ ఎంపీపీ కోల జమున-శ్రీనివాస్ రూ.50వేలు ఆలయ అధికారులకు ఆదివారం అందజేశారు. జైపూర్ లోని వేలాల మల్లన్న ఆలయాన్ని మాజీ ఎంపీపీ దంపతులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
ఈ సందర్భంగా మల్లన్న పట్నాల గద్దె నిర్మాణం, రేకుల షెడ్డు నిర్మాణం కోసం విరాళంగా రూ.50వేలు ఆలయ ఈఓకు అందజేశారు. వీటి నిర్మాణానికు రూ.50లకు పైగా ఖర్చు అయిన వాటిని తామే అందజేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా రేకుల షెడ్ నిర్మాణానికి భూమిపుజలు చేసి పనులు ప్రారంభించారు. వేలాల మల్లన్న ఆలయ అభివృద్ధికి విరాళం అందజేసిన కోల జమున, శ్రీనివాస్ దంపతులను ఆలయ అధికారులు, గ్రామస్తులు పలువురు అభినందించారు.