బాధితులకు అండగా ఉంటాం
అగ్నిప్రమాద బాధితులకు అన్నివిధాలుగా అండగా ఉంటామని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ భరోసానిచ్చారు. ఆదివారం ఆయన స్థానిక నాయకులతో కలిసి కొండగట్టు దిగువన బాధితులను పరామర్శించారు. సంఘటన జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. బీఆర్ఎస్ పక్షాన ఎమ్మెల్సీ ఎల్ రమణ అందించిన లక్ష నగదును, స్థానిక నాయకుల సహకారంతో పోగు చేసిన 60వేలను ఒక్కో కుటుంబానికి 5వేల చొప్పున అందజేశారు.
- చొప్పదండి మాజీ ఎమ్మెల్యే రవిశంకర్ డిమాండ్
- బీఆర్ఎస్ తరఫున బాధితులకు సాయం అందజేత
మల్యాల, నవంబర్ 30: అగ్నిప్రమాద బాధితులకు అన్నివిధాలుగా అండగా ఉంటామని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ భరోసానిచ్చారు. ఆదివారం ఆయన స్థానిక నాయకులతో కలిసి కొండగట్టు దిగువన బాధితులను పరామర్శించారు. సంఘటన జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. బీఆర్ఎస్ పక్షాన ఎమ్మెల్సీ ఎల్ రమణ అందించిన లక్ష నగదును, స్థానిక నాయకుల సహకారంతో పోగు చేసిన 60వేలను ఒక్కో కుటుంబానికి 5వేల చొప్పున అందజేశారు.
అనంతరం సుంకె రవిశంకర్ మాట్లాడుతూ, ఫైర్‌సిబ్బంది తక్షణమే స్పందించి ఉంటే ఇంత నష్టం వాటిల్లేది కాదని, ఆలస్యం కావడం వల్లే 30 దుకాణాలు కాలిపోయాయని ఆవేదన చెందారు. దుకాణదారులు తీవ్రంగా ఆర్థికంగా నష్టపోయారని, ప్రభుత్వం స్పందించి బాధిత కుటుంబాలకు 30లక్షల ఎక్స్‌గ్రేషియా చొప్పున అందించాలని డిమాండ్ చేశారు. లేదంటే బీఆర్ఎస్ పక్షాన పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. ఆయనవెంట నాయకులు కొండపలుకుల రామ్మోహన్రావు, బద్ధం తిరుపతిరెడ్డి, అయిల్నేని సాగర్‌రావు, పంజాల మల్లేశం, గుర్రం మల్లేశం, జనగం శ్రీనివాస్, బాలె సంజీవ్, తదితరులు ఉన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

