Former MLA Satish Kumar | సైదాపూర్, జూన్ 6: మండలంలోని పెర్కపల్లి గ్రామంలో గ్రామస్తులు పోచమ్మ విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసన సభ్యులు వొడితల సతీష్ కుమార్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. గ్రామ ప్రజలు ఎల్లా వేళల సంతోషంగా ఉండాలని కోరారు.
ఈ కార్యక్రమం లో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సోమారపు రాజయ్య, మాజీ ఎంపీపీ సారబుడ్ల ప్రభాకర్ రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ రెడ్డి, మండల ఉపాధ్యక్షులు బత్తుల లక్ష్మీనారాయణ, సీనియర్ నాయకులు ముత్యాల గాంధీ యాదవ్, సర్దార్, గ్రామ శాఖ అధ్యక్షుడు పిల్లి కొమురయ్య, సర్వాయి పేట గ్రామ శాఖ అధ్యక్షుడు మలుగు సంపత్, మండల యూత్ నాయకులు మాదం స్వామి, మాదం రమేష్, మాదం మహేష్, పిల్లి వెంకటేష్, జంపయ్య, రవి, కుమార్, నరేష్, కిష్టయ్య తదితరులు పాల్గొన్నారు.