మంథని, ఏప్రిల్ 16: ఎల్కతుర్తిలో ఈ నెల 27న నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవ సభ రాష్ట్రానికి వెలుగునిస్తుందని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ ధీమా వ్యక్తం చేశారు. బుధవారం మంథని పట్టణంలోని రాజగృహలో మంథని, ముత్తా రం, రామగిరి, కమాన్పూర్ మండలాల ముఖ్య నాయకులతో సన్నాహక సమావేశం నిర్వహించారు.
అనంతరం సభ వాల్ పోస్టర్ను ఆవిషరించి మాట్లాడారు. ఏప్రిల్ 27 గులాబీ పార్టీ పండుగ రోజని, ఆ రోజు గ్రామ గ్రామాన గులాబీ జెండాలు రెపరెపలాడాలని ఆకాంక్షించారు. మంథని నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో బీఆర్ఎస్ కార్యకర్తలు గులాబీ జెండాను ఆవిషరించాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని అంశాల్లో విఫలమవుతున్నదని, హామీల అమలు నుంచి, పాలనా పరమైన నిర్ణయాల వరకు అభాసుపాలవుతున్నదని విమర్శించారు.
బీఆర్ఎస్ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి వేధింపులకు గురి చేస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. కేసీఆర్ స్పీచ్ కోసం ప్రజలంతా ఉతంఠంగా ఎదురు చూస్తున్నారని, ఎప్పటికైనా తెలంగాణకు ఆయన నాయకత్వమే శ్రీరామరక్ష అని స్పష్టం చేశారు. సభకు అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు తగరం శంకర్లాల్, పూదరి సత్య నారాయణగౌడ్, ఆరెపల్లి కుమార్, ఎస్కే యాకుబ్, మాచిడి రాజుగౌడ్, పుప్పాల తిరుపతి, పెగడ శ్రీనివాస్, ఆసీఫ్, కొండా రవీందర్లత పాల్గొన్నారు.