Former Minister Eshwar | పెగడపల్లి: పెగడపల్లి మండలంలోని వివిధ గ్రామాల్లో పలు బాధిత కుటుంబాలకు శనివారం మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పరామర్శించారు. మండలంలోని ల్యాగలమర్రి గ్రామంలో ఇటీవల ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న గొల్లపల్లి కిషన్, ఎల్లాపూర్ లో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న మల్లారపు సుప్రియ, కీచులాటపల్లిలో గుండె పోటుతో మృతి చెందిన కొత్తపల్లి సత్తన్న, రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన నామాపూర్ కు చెందిన ఐకేపీ సీసీ కొత్తూరి రవికుమార్ కుటుంబ సభ్యులను మాజీ మంత్రి ఈశ్వర్, బీఆర్ఎస్ రాష్ట్ర నేత వోరుగంటి రమణారావు పరామర్శించారు.
ఈ కార్యక్రమంలో పార్టీ మండలాధ్యక్షుడు మల్లారెడ్డి, నాయకులు భాస్కర్ రెడ్డి, నరెందర్ రెడ్డి కరుణాకర్ రావు, కరుణాకర్ రెడ్డి, స్వామి, లక్ష్మణ్, లింగరెడ్డి, శ్రీనివాస్ గౌడ్, గంగాధర్ గౌడ్, రవి, తిరుపతినాయక్, రాజిరెడ్డి, సత్యనారాయణరెడ్డి, రాజశేఖర్ గౌడ్, వీరేశం, విజయ్ యాదవ్, ఆనందం, మల్లేశం తదితరులున్నారు.