Flexi photo controversy | సిరిసిల్ల రూరల్, ఏప్రిల్ 26: సిరిసిల్ల నియోజకవర్గంలో అధికారిక కార్యక్రమంలో ఫ్లెక్సీలో పొటోల వివాదం మరోసారి విమర్శలకు తావిస్తుంది. ఇటీవలే సిరిసిల్లలో అపరిల్ పార్కు ప్రారంభోత్సవంలో సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్, ఎంపీ బండి సంజయ్ కుమార్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పొటో లేకుండానే కార్యక్రమంలో ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు.
ఇది సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అధికారులు తేరుకొని, ఫ్లెక్సీని తొలగించిన విషయం తెలిసింది. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉండగా శనివారం తంగళ్లపల్లి మండలం కేంద్రంలోనీ రాజా ప్రపుల్ల రెడ్డి ఫంక్షన్ హాల్లో భూభారతి చట్టంపై అవగాహన సదస్సులో మరోసారి వివాదం నెలకొంది.
ఫ్లెక్సీలో ఈ సారి స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్, ఎంపీ బండి సంజయ్ కుమార్ పొటోలను ఎట్టకేలకు ఏర్పాటు చేయగా, కాంగ్రెస్ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పొటో లేకపోవడంపై విమర్శలకు తావించింది. దీంతో మరోసారి అధికారుల తీరుపై సర్వత్ర చర్చనీయాంశంగా మారింది.