Financial assistance | సారంగాపూర్, మే 31: సారంగాపూర్ మండలంలోని లచ్చక పేట గ్రామానికి చెందిన ఆకుల రమేష్ గౌడ్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా బాధిత కుటుంబానికి యూఏఈ తెలుగు హెల్పింగ్ హాండ్స్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో శనివారం ఆర్థిక సహాయం అందించారు. మృతుడికి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. వాళ్లది నిరుపేద కుటుంబం ఎవరైనా ఆపన్న హస్తం అందించాలని వాట్సాప్ గ్రూప్ సభ్యుడు చిరుపులా మల్లేష్ కు సమాచారం అందించడంతో విషయాన్ని యూఏఈ తెలుగు హెల్పింగ్ హాండ్స్ ఆర్గనైజేషన్ వ్యవస్థాపకులు బొడ్డుపల్లి రాము దృష్టికి తీసుకురావెళ్లారు.
వెంటనే ఆర్గనైజేషన్ గ్రూపులో ఉన్నవారితో మాట్లాడి ఇలాంటి కుటుంబాలకు మనం ఎంతో కొంత సహాయం చేయాలని చెప్పడంతో ప్రతీ ఒక్కరూ ముందుకు వచ్చారు. శనివారం బాధిత కుటుంబానికి యూఏఈ తెలుగు హెల్పింగ్ హాండ్స్ ఆర్గనైజేషన్ సభ్యులు రూ.10వేలతో మూడు నెలలకు సరిపడా నిత్యావసర సరుకులు అందచేశారు. ఈ సందర్భంగా ఆర్గనైజేషన్ టీం సభ్యులు అల్గోటి గంగాధర్, మల్లేష్, వేణు, శ్రీను, రాజేష్, రాజు, రమేష్, గంగన్న, రంజిత్, రమేష్ లకు ధన్యవాదాలు తెలిపారు.