కరీంనగర్ విద్యానగర్, మార్చి 25: సినీ హీరోయిన్ మెహ్రీన్ పిర్జాదా బుధవారం కరీంనగర్లో మెరిశారు. బుధవారం నగరానికి వచ్చిన ఆమె, సుభాష్‌నగర్‌లో ఏర్పాటు చేసిన ఆధునిక వైద్యసంస్థ డాల్ఫిన్ హాస్పిటల్స్‌ను ప్రారంభించారు. మహిళలు, పిల్లల సమగ్ర ఆరోగ్య సంరక్షణకు ఈ హాస్పిటల్ ఏర్పాటు చేశారని, కరీంనగర్, పరిసర ప్రాంతాల ప్రజలకు అత్యాధునిక, నాణ్యమైన వైద్య సేవలు అందుతాయని చెప్పారు. అనంతరం డాల్ఫిన్ హాస్పిటల్స్ నిర్వాహకులు మాట్లాడుతూ, అత్యాధునిక సాంకేతికతతో పాటు అనుభవజ్ఞులైన వైద్య బృందం ద్వారా నైతికతతో కూడిన నాణ్యమైన సేవలు అందిస్తామని వెల్లడించారు.
హాస్పిటల్లో అత్యాధునిక నియోనాటల్ ఐసీయూ, సకల సౌకర్యాలతో కూడిన పీడియాట్రిక్ ఐసీయూ, ఆధునిక ఆపరేషన్ థియేటర్లు, నిర్ధారణ పరీక్షలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. అలాగే డెలివరీ, హై-రిస్ ప్రెగ్నెన్సీ, మహిళలు, పిల్లలకు సంబంధించి ఒకే చోట 24 గంటల అత్యవసర వైద్య సేవలు అందుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ డైరెక్టర్లు డాక్టర్లు బీ రమేశ్, సురేశ్ కుమార్, ప్రశాంత్ రెడ్డి, హృదయ్ రంజన్, సిబ్బంది పాల్గొన్నారు.