Ramagiri | భూ సమస్యలపై క్షేత్రస్థాయిలో పరిశీలన.. రామగిరిలో పర్యటించిన పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్ష
పెద్దపల్లి జిల్లా రామగిరి మండలంలో నెలకొన్న భూ సమస్యలపై పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టారు. మండలంలోని ఉప్పట్ల–కేసారం గ్రామాల్లో మంగళవారం పర్యటించిన ఆయన ఆయా ప్రాంతాల్లోని భూములను పరిశీలించి, సంబంధిత అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు.
- ఉప్పట్ల–కేసారం ప్రభుత్వ భూమి రికార్డులు పరిశీలించిన తర్వాతే నిర్ణయం
- రైతుల అభ్యంతరాలు, అభిప్రాయాలు తెలుసుకున్నాకే సింగరేణి భూసేకరణపై తుది నిర్ణయం
Ramagiri | రామగిరి, సెప్టెంబర్ 22 : పెద్దపల్లి జిల్లా రామగిరి మండలంలో నెలకొన్న భూ సమస్యలపై పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టారు. మండలంలోని ఉప్పట్ల–కేసారం గ్రామాల్లో మంగళవారం పర్యటించిన ఆయన ఆయా ప్రాంతాల్లోని భూములను పరిశీలించి, సంబంధిత అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. ఉప్పట్ల–కేసారం గ్రామంలోని సర్వే నంబర్ 35లో ఉన్న ప్రభుత్వ భూమిని కలెక్టర్ పరిశీలించారు.
అనంతరం భూమికి సంబంధించిన రికార్డులు, రెవెన్యూ వివరాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే తదుపరి నిర్ణయం తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. అనంతరం రామగిరి మండలంలోని రాజాపూర్ గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) శ్రీరాములుతో కలిసి భూ నిర్వాసితులతో కలెక్టర్ సమావేశమయ్యారు. వారి సమస్యలు, అభ్యంతరాలు, అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. భూ సంబంధిత సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, అందుబాటులో ఉన్న రికార్డులను పరిగణనలోకి తీసుకుని తగిన నిర్ణయాలు తీసుకుంటామని తెలిపారు.
రైతుల అభిప్రాయాల తర్వాతే నిర్ణయం..
బుధవారంపేటకు సంబంధించి సింగరేణి సంస్థ చేపట్టనున్న భూసేకరణ ప్రక్రియలో భాగంగా ప్రాజెక్టు నివేదిక అందజేసినట్లు కలెక్టర్ తెలిపారు. భూసేకరణకు సంబంధించి రైతులు వ్యక్తం చేస్తున్న అభ్యంతరాలు, వారి అభిప్రాయాలను పూర్తిగా తెలుసుకున్న తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. రైతుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని తదుపరి చర్యలు చేపడతామని పేర్కొన్నారు. ఈ పర్యటనలో డీసీపీ రామ్‌రెడ్డి, గోదావరిఖని ఏసీపీ రమేష్, తహసీల్దార్ సుమన్‌తో పాటు సంబంధిత శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
North Korea: బాలిస్టిక్ క్షిపణులను పరీక్షించిన ఉత్తర కొరియా
Aadarsha Kutumbam | ఆదర్శ కుటుంబంలో అదిరిపోయే సర్ప్రైజ్.. వెంకటేష్ అభిమానులకు త్రివిక్రమ్ ట్రీట్!
Road Accident | మద్యం మత్తులో కారు నడిపి స్కూటీని ఢీకొట్టిన యువకుడు.. ముగ్గురు దుర్మరణం..!
Mythri Movie Makers | మైత్రీ మూవీ మేకర్స్ నుంచి మరో రొమాంటిక్ కామెడీ.. డెబ్యూ ఇస్తున్న శ్రీకాంత్ కుమార్తె
IAS Transfers | ఏపీలో పలువురు ఐఏఎస్‌ల బదిలీ.. పర్యాటక శాఖ కార్యదర్శిగా ఆమ్రపాలికి పోస్టింగ్!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

